Friday , 19 July 2019

Home » Slider News » 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీసీల తక్షణ కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత

2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీసీల తక్షణ కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత

January 12, 2019 12:21 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీసీల తక్షణ కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత A+ / A-

Reservations in Indiaబీసీల ప్రజాస్వామ్య హక్కుల విషయంలో, అవకాశాల విషయంలో, కాంగ్రెస్ బీజేపీ వైఖర్లలో అంతగా తేడాల్లేవు. ఇద్దరూ బీసీల్ని మొదటి నుండి మోసం చేస్తున్న వారే. నరేంద్రమోదీ RSS బానిస అనేది, అనుమానాలకు అతీతంగా, పలు సందర్భాల్లో స్పష్టంగా రుజువై పోయింది. 2015 లో బీహార్ ఎసెంబ్లీ ఎలక్షన్లకు కొద్దిరోజుల ముందు, RSS Chief, Mohan Bhagawat రిజర్వేషన్లపై సమగ్ర సమీక్ష జరగాలని బహిరంగ ప్రకటన చేసారు. దానిలోని కుట్రను పసిగట్టిన ఆరాష్ట్ర ప్రజలు, బీజేపీకి సరైన గుణపాఠమే చెప్పారు. అయినా బీజేపీకి కాని, పరివారశక్తులకు కాని ఏమాత్రం బుధ్ధొచ్చినట్లు లేదు. వారి అగ్రకుల అజెండా నుండి ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. కారణం “బీసీల అమాయకత్వం మీద, అనైక్యత మీద, అంతర్గత వైరుధ్యాల మీద, వారికి అంతనమ్మకం. భరోసా. వారిని తేలిగ్గా విడదీసి, అత్యధికుల్ని తమ బుట్టలో వేసుకో గలమనే తమధీమా. అందుచేతే కులాధారిత రిజర్వేషన్లకు ఎసరు పెట్టాలనే పరివారశక్తుల అంతర్గత అజెండాలో భాగంగా, కేవలం అగ్రకులాలకే ప్రయోజనం చేకూర్చే, 10% ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్లకు సంబంధించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లును, అతిచాకచక్యంగా, ఎలక్షన్లకు ముందు, ప్రతిపక్షాలు నోరెత్తలేని వాతావరణంలో, కేవలం 36 గంటల వ్యవధిలో, పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం సాధించారు. లక్షలాది వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా GST లో, నిన్న కొన్ని సడలింపులు మార్పులు ప్రకటించారు. “ఇవేకాదు ఇంకా ఉన్నాయి మాఅస్త్రాలు, ఎదురు చూడండి” అంటున్నారు. బీసీల ప్రయోజనాల్ని తుంగలో తొక్కడానికి, అదేసమయంలో ఆధిపత్య శక్తులు ఇంకా ఇంకా బలపడానికీ, అన్నిరకాల కుట్రలు విజయవంతంగా జరుగుతున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినా, మోదీ ప్రధానిగా గద్దెనెక్కినా బీసీల సర్వ నాశనం తప్పదు. ఎవరూ నోరెత్తే పరిస్థితే ఉండదు. అయితే కాంగ్రెస్ నేత్రుత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరిగేది అంతగా ఏమీ ఉండక పోవచ్చు. కాపుల రిజర్వేషన్ల విషయంలోను, 124 రాజ్యాంగ సవరణ బిల్లు సందర్భంగానూ, మరోసారి నిర్ధారణ జరిగిన టీడీపీ వైఖరికూడ బీసీలకు వ్యతిరేకమే. ఆమాటకొస్తే అగ్రకుల పార్టీ ఏదైనా, బీసీల్ని ఉపయోగించుకొని అణగ తొక్కేస్తున్నాయి. ఈ నేపధ్యంలో, ఆచణీయమైన, ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయం, బీసీల ముందు ఏం ఉంది ? రాజకీయంగా బీసీల కార్యాచరణ ఎలాఉంటే, వారిప్రయోజనాలు నెరవేరతాయి అనేది, చాలా కీలకమైన కోణం. ఇటువంటి క్లిష్ట సమస్యపై కీలకమైన చర్చ, కేవలం వాట్సాప్ గౄపుల్లోకి పరిమితం చేస్తే సరిపోదు. ఇతర వేదికల్లో కూడా లోతైన చర్చ తక్షణం జరగాలి. బీసీలకు లబ్ధి చేకూర్చే ప్రత్యమ్నాయ మార్గాల్ని గుర్తించాలి. ఆవైపుగా బీసీల కార్యాచరణ నిర్ణయం కావాలి.

Kondal Rao Advocateకొండలరావు

98494 33644

2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీసీల తక్షణ కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత Reviewed by on . బీసీల ప్రజాస్వామ్య హక్కుల విషయంలో, అవకాశాల విషయంలో, కాంగ్రెస్ బీజేపీ వైఖర్లలో అంతగా తేడాల్లేవు. ఇద్దరూ బీసీల్ని మొదటి నుండి మోసం చేస్తున్న వారే. నరేంద్రమోదీ RSS బీసీల ప్రజాస్వామ్య హక్కుల విషయంలో, అవకాశాల విషయంలో, కాంగ్రెస్ బీజేపీ వైఖర్లలో అంతగా తేడాల్లేవు. ఇద్దరూ బీసీల్ని మొదటి నుండి మోసం చేస్తున్న వారే. నరేంద్రమోదీ RSS Rating: 0
scroll to top