Sunday , 16 December 2018

Home » Slider News » 🏻రాజకీయం అంటే వారసత్వమా?అనుభవమా ?

🏻రాజకీయం అంటే వారసత్వమా?అనుభవమా ?

May 28, 2017 8:33 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on 🏻రాజకీయం అంటే వారసత్వమా?అనుభవమా ? A+ / A-

రాజుల రాజ్యాలు పోయినా వంశపారంపర్యపాలన పోలేదా?రాజకీయబానిసత్వం నుంచి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది?  

300 ఏళ్ళు పాలించిన బ్రిటీష్ వాళ్ళు భారత్ లోవంశపారంపర్య  రాజుల రాజ్యాలు కాలగర్భంలో కలిపేశారు.మనం పోరాడి స్వాతంత్య్రం  తెచ్చుకున్నాము అని భ్రమలోబ్రతుకుతున్నాము వాళ్ళు పోగొట్టిన వంశపారంపర్య  పాలన తెచ్చుకున్నాము. అంబేద్కర్  రాజ్యాంగం మాత్రమే రాయగలిగారు కానీబానిస సంకెళ్లు తెంచ లేకపోయారు.రాజకీయ బానిసత్వం నుంచి స్వాతంత్య్రం ఉందా మనకు అంబేద్కర్ చెప్పినట్టు 5 ఏళ్ళు రిజర్వేషన్స్ ఇస్తే ఆర్ధిక సామాజిక రాజకీయసమానత్వం ఏర్పడుతుంది అని భావించారు 1950-1956 కి 5 ఏళ్ళు పూర్తి అయ్యినా మరో 60 ఏళ్ళు 2017 కి  పూర్తి అయ్యినా రాజకీయ ఆర్ధిక సామాజిక సమానత్వం లేదు అంటే అది పాలకుల లోపమేకదా.ఏళ్లకు ఏళ్ళు రిజర్వేషన్స్   పెంచుతున్నాము తప్ప పేగు ఎండిన  ఆకలి కేకలు   గూడులేని  రోదనలు తీర్చగలుగుతున్నారా ? రిజర్వేషన్స్ ఇస్తే సమానత్వం వస్తుందా    అవినీతి తో కోట్లు సంపాదించి  ఒక పార్టీ పెట్టి తండ్రి తరువాత కొడుకు మనవడు ఇలా వారసత్వ రాజకీయాలు కుల గజ్జితో  నడుస్తున్నాయి తప్ప అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఉందా . కనీసం తెలుగు చేతకాని దద్దమ్మలు ఎక్కడో విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపి స్వదేశం రాగానే మంత్రి పదవులు ఇవ్వడం……అస్సలు ఈ రాజకీయ బానిసత్వం ఎన్నాళ్ళు కొత్తవారికి చోటు లేదా?. ఎవ్వడు అయ్యినా ఒక మంత్రి పార్టీ మారగానే ఏదో ప్రళయం వచ్చినట్టు ప్రజలు అందరికి జరగరాని నష్టం వచ్చినట్టు మీడియా చేసే హడావిడి చూడాలి. అతివాదులు మితవాదుల్ని పోల్చినట్టు నీరు ఉన్నచోటకు వెళ్లి కప్పలు బెక బెక మంటాయి అన్నట్టు అధికారం ఉన్న పార్టీ లలో చేరి ప్రజల కోసం అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాను  అని నీతులు చెప్పే చేత గాని దద్దమ్మలు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం కల్లా. మంత్రి కొడుకు మంత్రి కావాలి సీఎం కొడుకు సీఎం కావాలి అన్న సాంప్రదాయం ఉన్నంత కాలం ప్రజాశ్రేయస్సు కు గొడ్డలి పెట్టు .

✍🏻రాజకీయానికి అనుభవం కన్నా చిత్తశుద్ధి ఉండాలి ఆవగింజ అంత చిత్తశుద్ధితో పనిచేస్తే ఆకాశమంత అభివృద్ది చేయొచ్చు అనుభవం ముఖ్యమంత్రి కొడుకులకు అవసరం లేదు సామాన్యుడు రాజకీయాలలోకి వస్తే అనుభవం కావాలి. ఒక కలెక్టర్ ఏస్పీ లకు ఏ అనుభవం ఉంది అని ఒక జిల్లా యంత్రాంగం 25 ఏళ్లకు కట్టబెడుతున్నారు ? తెలివైన వారు ప్రజాసేవ చేస్తారు అనే నమ్మకం తోనే కదా హిస్టరీ జియోగ్రఫీ లాంటి సబిెక్ట్స్ చదివిన చదువుకు  చేపట్టే ఉద్యోగానికి సంబంధం లేకపోయినా 58 ఏళ్ళు సర్వీస్ చెయడానికి 2 సంవత్సరాలు కష్ట పడి తెలివైన వాడిని అని నిరూపించుకుంటే ఇస్తున్నారు.మరి అంత కంటే తెలివైన వారు దేశం లో పరిస్థితులు భౌగోళిక అంశాలు ప్రజాస్వామ్య విలువలు రైతులు నిరుద్యోగులు అన్ని తెలిసిన మేధావులకు ఎందుకు పట్టం గట్టలేక పోతున్నారు? బికాం ఫిజిక్స్ లో ఉంటుంది అని కనీసం రాష్ట్ర ఆదాయం వ్యయం అంటే తెలియని దద్దమ్మలు రాజ్యం ఏలుతుంటే తెలివైన యువకులు ఇవన్నీ బయట పెట్టి డబ్బు అధికార బలం లేక జైల్లో మగ్గుతున్నారు .

✍🏻ఓటరా నీ ఓటు తో దేశం స్థితి గతులు  మార్చు అన్ని తెలిసిన చదువుకున్న యువతకు ప్రజాస్వామ్య చక్రం లో చోటు కల్పించు పార్టీ ల కన్నా ప్రజాసేవ చేసే వ్యక్తి ముఖ్యం రాజ్య ది కారం ఒకే చోట కేంద్రీ కృతం కాకుడదు కులం మతం ప్రాంతం భాష  లాంటి సున్నితమైన అంశాలతో పార్టీలు మారి 30 ఏళ్ళు పదవులు చేపట్టి నిన్ను రాజకీయ బానిసను చేసే కూని కోరులకు చమరగితం పాడడాలి.

By  కోటిపల్లి అయ్యప్ప

FARWARDED WHATSAAP

🏻రాజకీయం అంటే వారసత్వమా?అనుభవమా ? Reviewed by on . రాజుల రాజ్యాలు పోయినా వంశపారంపర్యపాలన పోలేదా?రాజకీయబానిసత్వం నుంచి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది?   300 ఏళ్ళు పాలించిన బ్రిటీష్ వాళ్ళు భారత్ లోవంశపారంపర్య  రాజుల రాజుల రాజ్యాలు పోయినా వంశపారంపర్యపాలన పోలేదా?రాజకీయబానిసత్వం నుంచి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది?   300 ఏళ్ళు పాలించిన బ్రిటీష్ వాళ్ళు భారత్ లోవంశపారంపర్య  రాజుల Rating: 0

Related Posts

scroll to top