Friday , 16 November 2018

Home » Slider News » హైదరాబాద్ పేరు మారుస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్

హైదరాబాద్ పేరు మారుస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్

November 10, 2018 11:06 am by: Category: Slider News, తెలంగాణ Comments Off on హైదరాబాద్ పేరు మారుస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ A+ / A-

16వ శతాబ్దంలో హైదరాబాద్ పేరు ‘భాగ్యనగరం’ అని ఉండేదని, బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ తప్పకుండా పేరు మార్చుతామని బీజేపీ నేత రాజ సింగ్ తెలిపారు.

MLA raja Singhతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అలహాబాద్ తరహాలోనే హైదరాబాద్ పేరు కూడా మారుస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, ఇలాంటి పేర్లను మార్చడం తమ రెండో లక్ష్యమని వెల్లడించారు.

ఒకప్పుడు భాగ్యనగరంగా పేరొందిన నగరానికి 16వ శతాబ్దంలోని కుతుబ్ షాహీ హైదరాబాద్‌గా పేరు మార్చారని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది హిందువులపై దాడులు చేశారని, ఆలయాలను ధ్వంసం చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి భాగ్యనగరంగా మార్చుతామని తెలిపారు.

హైదరాబాద్ పేరు మాత్రమే కాకుండా అప్పట్లో నగరం, తెలంగాణలోని ఇతర ప్రాంతాల పేర్లను కూడా మార్చారని రాజ సింగ్ తెలిపారు. సికింద్రాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల పేర్లను కూడా మార్చారన్నారు. అలాంటి ప్రాంతాలకు దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన ప్రముఖుల పేర్లు పెడతామని వెల్లడించారు.

హైదరాబాద్ పేరు మారుస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ Reviewed by on . 16వ శతాబ్దంలో హైదరాబాద్ పేరు ‘భాగ్యనగరం’ అని ఉండేదని, బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ తప్పకుండా పేరు మార్చుతామని బీజేపీ నేత రాజ సింగ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ 16వ శతాబ్దంలో హైదరాబాద్ పేరు ‘భాగ్యనగరం’ అని ఉండేదని, బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ తప్పకుండా పేరు మార్చుతామని బీజేపీ నేత రాజ సింగ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ Rating: 0
scroll to top