Saturday , 25 November 2017

Home » ఫోకస్ » హైటెక్….బాబు….షోకేస్…..బాబు

హైటెక్….బాబు….షోకేస్…..బాబు

April 5, 2016 6:52 am by: Category: ఫోకస్ Leave a comment A+ / A-

సెటైర్

HOW REVANTH REDDY LAUDED NARA LOKESH
తెలంగాణ ఐ.టి శాఖ మంత్రి షార్ట్ కట్ లో కెటిఆర్ గా పిలువ బడే కె తారక రామారావు హైటెక్ మంత్రిగా పేరు సార్దకం చేసుకుని దూసుకు పోతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంటుంటే పక్క రాష్ర్టం అయిన ఎపి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ బాబు తెల్లముఖం వేసి తల్లడిల్లి పోతున్నాడు. తాను హైదరాబాద్ లో పుట్టానంటూ తెలంగాణాలోనే ఉంటానంటూ ఏదేదో ఇరగ దీస్తానంటూ పిట్టకూతలతో మొత్తానికి ఉత్తర కుమారుడని పించుకున్నాడు. మాటలు చెప్పడం తప్ప చేతలు రావని ఉత్త షోకేస్ బాబని లోకేశ్ బాబుకు ఇప్పుడు ఒక పేరు కూడ స్థిరపడి పోయింది. ఇలాంటి అర్హతలు కలిగిన లోకేశ్ బాబు మంత్రి కాబోతున్నాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు మెప్పు కోసం ఎపి మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ పార్టి నేత రేవంత్ రెడ్డి లోకేశ్ ను మంత్రిని చేయాలని పట్టు బడుతున్నారట. మొదట కేంద్ర మంత్రిని చేస్తే బాగుంటదని ప్రతిపాదించారు. ఎక్కడ దేనికి షూట్ అవుతాడా అంటూ చంద్రబాబు కూడ తన సన్నిహితుల దగ్గర బాగా సమాలోచనలు చేసిండట. పదవులు లేక పోతే కాంగ్రేస్ పార్టీలో రాహుల్ గాంధి పవర్ లేనట్లు మిగిలాడని అట్ల లోకేశ్ కావద్దని చంద్ర బాబు తోక పత్రిక ఆంధ్ర జ్యోతి అధినేత రాధాకృష్ణ తన పత్రికలో ఓ వార్త కూడ రాయించాడు.
ఐఎఎస్ ల ముందు కూడ బాబు లోకేశ్ విషయం ప్రస్తావించాడట. లోకేశ్ ఉత్త ముద్దపప్పుని అధికారులకు ఏనాడో రూఢి అయింది. అయినా మీ ప్రభుత్వం మీ ఇష్టం అంటూ లోకేశ్ ను మంత్రిని చేస్తే మాకేంటి ఇంకా…ఏ దైనా చేస్తే ఏమిటి అనుకుంటున్నారట. తననేమి తక్కువ అంచనా వేయవద్దని పక్క రాష్ర్టంలో కెటిఆర్ కు ఏ మాత్రం తీసి పోనని తనకో బుగ్గ కారు ఇస్తే సత్తా చూపిస్తానంటున్న లోకేశ్ ఉబలాటం మొత్తానికి త్వరలో నెర వేర బోతోందట మరి.

హైటెక్….బాబు….షోకేస్…..బాబు Reviewed by on . సెటైర్ తెలంగాణ ఐ.టి శాఖ మంత్రి షార్ట్ కట్ లో కెటిఆర్ గా పిలువ బడే కె తారక రామారావు హైటెక్ మంత్రిగా పేరు సార్దకం చేసుకుని దూసుకు పోతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్ సెటైర్ తెలంగాణ ఐ.టి శాఖ మంత్రి షార్ట్ కట్ లో కెటిఆర్ గా పిలువ బడే కె తారక రామారావు హైటెక్ మంత్రిగా పేరు సార్దకం చేసుకుని దూసుకు పోతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్ Rating: 0

Related Posts

scroll to top