Thursday , 19 July 2018

Latest News
Home » Slider News » హిందూ భారత నారికి ఎంత కష్టం

హిందూ భారత నారికి ఎంత కష్టం

August 5, 2016 5:02 am by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

jashodaben

జశోదా బెన్..ఈ దేశంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు బాగా పాపుల్ ఆయిన పేరు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడి పదవి భాద్యతలు చేపట్టిన తర్వాత ఈమె గురించి ప్రపంచానికి తెల్సి పోయింది.నరేంద్ర మోడీతో ఎప్పుడో చిన్నతనంలో జశోదాబెన్ కు వివాహం జరిగింది. చిన్నతనంలోనే మోడి భార్యను విడిచి పెట్టారు. ఆ తర్వాత మోడి అంచె లంచెలుగా ఎదిగి గుజరాజ్ కు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత దేశానికి ప్రధాన మంత్రిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. మోడి విడిచి పెట్టినప్పటికి పాపం జశోదా బెన్ మాత్రం మరో వివాహం చేసుకునేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆమె రిటైర్ అయిన తర్వాత సోదరుడి వద్ద ఉంటూ తీరిక వేళ్ళలో చిన్నపిల్లకు చదువులు చెప్పడంతో పాటు సోదరుడి కిరాణ షాపులో కూర్చుని సరుకులు విక్రయిస్తున్నారు.

జశోదాబెన్ కిరణా షాపులో కూర్చుని ఉండగా ఓ పోటో గ్రాఫర్ ఫోటో తీసాడు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వీర విహారం చేస్తోంది. పంజాబ్ లోని ఉంజా పట్టణం బ్రాహ్మణవాడ గ్రామంలోని తన సోదరుడు అశోక్‌భాయ్ ఇంట్లో నివసిస్తున్న జశోదా బెన్ కిరాణా షాపులో కూర్చుని సరుకులు విక్రయిస్తూ సోదరుడికి సహాయం చేస్తూ కాలం గడుపుతోంది. జశోదాబెన్ అనేక సార్లు తాను అధికారికంగా నరేంద్ర మోడీకి భార్యననే విషయం ధృవీకరింప చేసేందుకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల మీద దరఖాస్తులు చేసింది. అధికారులు మాత్రం ఎక్కడా నరేంద్ర మోడీకి భార్య అనే పదం లేకుండా సమాదానాలు ఇచ్చి తెలివిగా తప్పించుకున్నారు. జశోదా బెన్ దరఖాస్తులకు ఇప్పటికి సమాధానాలు లభించ లేదు.

హిందూ భారత నారికి ఎంత కష్టం Reviewed by on . జశోదా బెన్..ఈ దేశంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు బాగా పాపుల్ ఆయిన పేరు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడి పదవి భాద్యతలు చేపట్టిన తర్వాత ఈమె గురించి ప్రపంచానికి జశోదా బెన్..ఈ దేశంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు బాగా పాపుల్ ఆయిన పేరు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడి పదవి భాద్యతలు చేపట్టిన తర్వాత ఈమె గురించి ప్రపంచానికి Rating: 0

Related Posts

Leave a Comment

scroll to top