Tuesday , 25 June 2019

Home » Slider News » హరీష్ రావు ఎప్పుడూ ‘డిఎస్’ కాదు.. ఏది ‘మిస్’ కాడు

హరీష్ రావు ఎప్పుడూ ‘డిఎస్’ కాదు.. ఏది ‘మిస్’ కాడు

July 1, 2016 1:43 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

ఎప్పటికి మిస్ కాడు…….
minister hareesh rao and kcr fight‘ఇప్పుడున్నదే నాకు పెద్ద ఫదవి..ఇంతకంటే పెద్ద పదవులు లేవు.. ఉన్నా రావు. వచ్చినా వద్దని..’ తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి టి.హరీష్ రావు తన మనోగతాన్ని తెలుపడం కొంత కలకలం రేపినట్లైంది. హరీష్ రావు ఇప్పుడు సముచిత నిర్ఞయం తీసుకున్నారని అన్ని వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. చుట్టూ ఉన్న వందిమాగధుల నుండి తొందరగా బయట పడ్డందుకు ఆయనకు శుభాకాంక్షలు.
ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉండాలని ఇటీవల జరిగిన ‘వరంగల్ జాతర’ పర్యటన సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడనుభవిస్తున్న పదవులు అనుకుంటే రాలేదు.. అనుకుంటే వచ్చేటివి కాదు.. అయినదానికి కానిదానికి ఒరిజినాలిటీని పోగొట్టుకుంటే మంచిది కాదని హరీష్ రావు గ్రహిస్తే ఇంకా బాగుంటుంది.
గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ‘డిఎస్’ కూడా నేను గెలిస్తే ‘పెద్ద పదవొస్తదని’ నాటి ఎన్నికలలో తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నడు. పార్టీ నిర్మాణంలో పార్టీ అధ్యక్షుడిదే పెద్ద ఫోస్టు ఆ పార్టీలో.. ఆనాడు సీఎం అయ్యే ఛాన్స్ ను పోగొట్టుకొని నేడు పార్టీ మారి రాజ్యసభ సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి తెరవెనుక రాజకీయాలు ఇంకా రసవత్తరమే. ‘కేకే యానం’ అదే కోవలోకి వస్తది.
కేటీఆర్ ను సీఎం చేయాలనుకునే కేసీఆర్ యాగాన్ని ఆపే శక్తి ఇప్పుడిక ఎవరికీ లేకుండా పోయింది… ఒక్క కాలానికి తప్ప. హరీష్ రావు తెలుసుకున్నాడో లేదో గానీ.. ఆయన భుజంపైన గన్ను పెట్టి కేసీఆర్ ను కొందరు కొట్టాలనుకున్నారు. అది సాధ్యం కాదన్న విషయం వారి చిన్న మెదడులకు ఎన్నడూ తెలియదు. వచ్చిన అధికారదాహపు అవకాశాన్ని ఆ సామాజికవర్గం కూడా వదులుకోదు. ఎప్పుడైనా వారందరూ ఒక్కటే అన్న విషయాన్ని మిగిలిన వాళ్లు తెలుసుకుంటే తెలంగాణలో బానిసల మాదిరిగా కాకుండా స్ఫూర్తిమంతమైన నాయకత్వం వచ్చే అవకాశముంది. పార్టీలో, ప్రభుత్వంలో హరీష్ రావు కొన్ని రకాల బాధలు ఎదుర్కొన్నది వాస్తవమే అయినప్పటికీ.. అవన్నీ తవ్వుకుంటే వచ్చేది శూన్యమే. ఇప్పటి వరకూ విపక్షం నుండే కాదు, స్వపక్షం నుండీ అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని హరీష్ రావు రాటుదేలినట్లైంది.
‘ఇప్పుడున్న స్థాయి కంటే పెద్ద స్థాయి లేదు.. నాకు రాదు.. నాకు వద్దు..’ అని హరీష్ రావు అన్న వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేకులకు ఇప్పుడు ఎండమావులే దిక్కయ్యాయి. హరీష్ అనుయాయులు కూడా తమను కేసీఆర్ తొక్కేస్తుండనో.. మా నాయకున్ని తొక్కేస్తుండనో.. అనుకునే బానిస మనస్తత్వం నుండి బయటపడాలి. అప్పుడే వారందరితో పాటు హరీష్ రావుకు మన:శాంతి, రాష్ట్రానికి కూడా అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంది. హరీష్ రావు వెనుక ఉన్న శత్రువులనో లేదా శత్రువుల ఆలోచనలనో తప్పించడమో కేసీఆర్ ధ్యేయం గానీ.. హరీష్ రావును అణగదొక్కడం మాత్రం ఖచ్ఛితంగా కేసీఆర్ లక్ష్యం కాదని హరీష్ రావు అభిమానులు మరియు ఆయన ఎప్పుడు తెలుసుకుంటారో.. అప్పుడే వారందరి వెంట ఆనందం, పదవులూ రెండూ దక్కే అవకాశముంది.
ఇప్పుడిక సీఎం కు మిగిలిన ఏకైక ప్రతిపక్షం ప్రజలే.. వారి నుండే మరో నాయకుడు లేదా పార్టీ పుట్టడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి…. ఏమో గుర్రం ఎగరానూ వచ్చు!..

సుదర్శన్ భారత్
రచయిత సామాజిక విశ్లేషకులు

హరీష్ రావు ఎప్పుడూ ‘డిఎస్’ కాదు.. ఏది ‘మిస్’ కాడు Reviewed by on . ఎప్పటికి మిస్ కాడు....... 'ఇప్పుడున్నదే నాకు పెద్ద ఫదవి..ఇంతకంటే పెద్ద పదవులు లేవు.. ఉన్నా రావు. వచ్చినా వద్దని..' తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి టి ఎప్పటికి మిస్ కాడు....... 'ఇప్పుడున్నదే నాకు పెద్ద ఫదవి..ఇంతకంటే పెద్ద పదవులు లేవు.. ఉన్నా రావు. వచ్చినా వద్దని..' తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి టి Rating: 0
scroll to top