Tuesday , 25 June 2019

Home » Slider News » ‘హమారే కో తెలంగాణ మే మిలాలేవో’

‘హమారే కో తెలంగాణ మే మిలాలేవో’

January 4, 2019 12:15 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on ‘హమారే కో తెలంగాణ మే మిలాలేవో’ A+ / A-

Dhrmabad Villagersతెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజల ఫిదా అయ్యారుయ తమ గ్రామాలను తెలంగాణ రాష్ర్టంలో కలపాలంటూ ఉద్యమం కూడ చేపట్టారు. దాంతో మహారాష్ర్ట ప్రబుత్వం ఇరకాటంలో పడింది. ఉద్యమంలో గ్రామాల సర్పంచ్ లు, శినసేన, బిజెపి కార్యకర్తలు నాయకులు ఉంటడం విశేషం. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దులో 40 గ్రామాలు ఉన్నాయి. వీరికి తెలంగాణ వారితో బంధుత్వాలు, సత్సంబంధాలున్నాయి. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు కావడం, తమ రాష్ట్రంలో అవేమీ లేకపోవడంతో తాము కూడా తెలంగాణలో చేరతామని కోరుతున్నారు. 40 గ్రామాల సర్పంచులు జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేపట్టారు. వీరు ఇప్పటికే తెలంగాణ ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణలో రూ.వెయ్యి పెన్షన్ ఇస్తుంటే.. మహారాష్ట్రలో కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ప్రసూతి సాయం.. ఇలాంటి సంక్షేమం పథకాలేమీ లేవని, తమను తెలంగాణ రాష్ట్రంలో కలిపేస్తే అవన్నీ వర్తిస్తాయని వారు కోరుతున్నారు.
మాజి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపి కవితలను కల్సి తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ విజ్ఞాపనలు అంద చేశారు.
ఈ మద్య తెలంగాణ రాష్ర్ట అమ్మాయని మహారాష్ర్ట గ్రామంలోని అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం సందర్భంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వం లక్ష రుపాయల నగదు ఇచ్చిందని అమ్మాయి కుటుంబ సబ్యులు అబ్బాయి వారికి చెప్పారు. ఈ వార్త మహారాష్ర్యీయులను ఎంతో అబ్బుర పరిచింది. తమ గ్రామాలకు అభివృద్ధి పథకాలు చేరడం లేదని గ్రామాలను తెలంగాణ లో కలిపే వరకు పోరాడతామని వారు భీష్మించారు.

‘హమారే కో తెలంగాణ మే మిలాలేవో’ Reviewed by on . తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజల ఫిదా అయ్యారుయ తమ గ్రామాలను తెలంగాణ రాష్ర్టంలో కలపాలంటూ ఉద్యమం కూడ చేపట్టారు. దాంతో మహా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజల ఫిదా అయ్యారుయ తమ గ్రామాలను తెలంగాణ రాష్ర్టంలో కలపాలంటూ ఉద్యమం కూడ చేపట్టారు. దాంతో మహా Rating: 0
scroll to top