Friday , 19 July 2019

Home » NEW » ‘ సిరి ధాన్యాలు ‘ మానవాళి కి వరాలు. 

‘ సిరి ధాన్యాలు ‘ మానవాళి కి వరాలు. 

కొర్ర బియ్యం, అండు కొర్ర బియ్యం, సామెల బియ్యం, అరికెల బియ్యం, ఊదల బియ్యం ఈ ఐదూ పంచరత్న సిరి ధాన్యాలు !

nature diet Milletsఎందుకంటే, సిరి ధాన్యాలే ముఖ్య ఆహారం గా – మీ ఆహారం మీరు తింటూ, మహమ్మారుల్లాగా పీడించే రోగాల బాధలనుండి విముక్తి పొందగలగటం ఎంత సుఖం గా ఉంటుంది? సిరిధాన్యాలు 8 నుంచి 12.5% ఫైబర్ కలిగి ఉండటం వల్ల తిన్న తరువాత 5 నుండి 7 గంటల పాటు చిన్న మొత్తాలలో గ్లూకోజు ను వదులుతాయి. మనఆరోగ్యాలు కాపాడతాయి. రోగాలను తగ్గిస్తాయి. రోగాలు రాకుండా ఆపుతాయి . సిరి ధాన్యాలనబడే 5 ధాన్యాలలో ఒక్కొక్కటీ కొన్ని కొన్ని దేహపు వ్యవస్థ లను సరి చేస్తాయి, రోగ నివారణ కూడా చేస్తాయి. మనకు అవసరమైన పోషకాలు, లవణాలు, అమీనో అంలాలు, విటమిను లో ఇవ్వటం లో సిరిధాన్యాలదే ముందు చేయి.

సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపుగింజ కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే.

చక్కర వ్యాధి, అధిక రక్త పోటు, మోకాళ్ళ నొప్పులూ, ఊబకాయం, రక్తం లో పెరిగిన ట్రై గ్లిసెరైడ్స్ , కొలెస్ట్రాల్, మూర్ఛలు, గాంగ్రీనులు, క్యాన్సర్లు, మూత్ర పిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, వీర్య కణాలూ, చర్మ వ్యాధులూ – ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరిధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.
పోలిష్ చేయని సిరి ధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జ ఉత్తేజపరచటం, రక్త శుద్ధి , థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, స్త్రీలలో ఆశించే PCO d, ఇతర పునరుత్పత్తి మండల సమస్యలు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.

వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు.

సిరి ధాన్యాలకు తోడుగా మీకు రోజూ వాడుక లో ఉండే మొక్కలూ, ఆకులూ, దినుసుల కషాయాలు కూడా సేవించి 5 -6 వారాల్లో పెద్దపెద్ద
రోగాలనుంచి కూడా ఊరట పొందగలగటం ఒక అద్భుతమైన విశేషం.

అల్లం, కరివేపాకు, మెంతి ఆకు, బొప్పాయి ఆకు, తములపాకు, కానుగ, పారిజాతం, జామ, గరిక, రావి, కొత్తిమీర, పుదీనా, వేప చిగుళ్లు, చింత చిగుళ్లు, అరటి దూట, మునగ పూలు, పునర్నవ లేదా అటిక మామిడి, దాల్చిన చెక్క, పసుపు కొమ్ము ల వంటి అతి సాధారణ దైనందిన జీవితంలో మనకు పనికి వచ్చే దినుసులూ, ఆకులే మనకు ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేస్తాయి. ( కషాయాలు : కషాయం చేసుకునేందుకు 6 ఆకులను/1 – 2 గుప్పెళ్ళ దినుసులను వినియోగిస్తే చాలు. గ్లాస్సున్నర నీటి లో శుభ్రం చేసిన చిన్న ముక్కలుగా కోసిన ఆకులని/దినుసులను 4 నిమిషాలపాటు ఉడకపెట్టి, వడ పోసుకుని, కషాయాలను గోరువెచ్చ గా ఖాళీ కడుపు మీద సేవించాలి.)

ఎంత సులువుగా ఉంది ! ఎంత సరళంగా ఉంది ! ఈ మార్గాన్ని మనకు ప్రసాదించిన డాక్టర్ ఖాదర్ కు శతకోటి నమస్కారాలు , కృతజ్ఞతలు.

ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ‘ఫేస్బుక్’ మీద ‘Millet ZONE ‘ పేజీ కి వెళ్ళండి. ఈ క్రింది విషయాల పై విజ్ఞానం పొందండి.

థైరాయిడ్ వ్యాధి తగ్గించుకోవడానికి సిరి ధాన్యాలు ఎలా సాయ పడతాయి?

PCO d ల నివారణ కూ సిరి ధాన్యాలు ఎలా సాయ పడతాయి?

ఊబకాయం ఎలా తగ్గించుకోవాలి?

పక్షవాతం వచ్చి తగ్గిన రోగులు ఎలా ఊరట పొందాలి?

మలబద్దకం పోగొట్టుకోవటం ఎలా?

బుద్ధిమాంద్యం తగ్గించుకోవడం, జ్ఞాపకశక్తి పెంచుకోవటం ఎలా?

ఎనీమా కి ఏళ్ళ తరబడి అలవాటైనా, తిరిగి సాధారణ ఆరోగ్యం పొందే విధానం?

మధుమేహ వ్యాధి ని తగ్గించు కోవటం ఎలా ?

మనం తెల్ల పంచదార/చక్కర ఎందుకు వాడకూడదు? తాటి బెల్లం ఎందుకు మనకు శ్రేయస్కరం?

ఇన్స్టంట్ నూడుల్స్ మనకు ఎలా అనారోగ్య కారకాలు?

తెల్ల బియ్యం, మైదా పదార్థాలు మనకు ఎందుకు మంచివి కావు?

కేవలం దుకాణాల్లో అమ్మే టేబుల్ సాల్ట్/ఉప్పు లో లోపం ఏమిటి?

రిఫైన్డ్ నూనెలు మన ఆరోగ్యాలు ఎందుకు హరిస్తాయి? సేంద్రియ చెక్క
గానుగ, కోల్డ్ ప్రెస్సెద్ నూనెలు ఎందుకు మంచివి?

నేడు నాగరికత పేరు తో వాడే makeup సామాన్లు, lip stick లలో,
గోళ్ళ రంగులూ, షాంపూ, సబ్బులలో, టూత్ పేస్టులలో ఎన్ని
హానికారక రసాయనాలు దాగి ఉన్నాయి ? వీటిని అధిగమించి
జీవించటం ఎలా ?

అజిన మోటో /చైనీస్ సాల్ట్ మన నరాలకు ఎందుకు హానికరకం?

ప్రపంచ మధుమేహ వ్యాధి పీడితుల సంఖ్యా అమెరికా వంటి దేశాలలో
ఎలా ఉంది? మన దేశం మరో పది సంవత్సరాల్లో ఎటు పోతుంది?
మధు మొహం మరో పది దీర్ఘ వ్యాధుల ఆరంభానికి ఎలా
కారకమౌతుంది?

గోధుమల తో వచ్చిన చిక్కు ఏమిటి? గ్లూటెన్, గ్లై ఫోసేటు లగురించి,
సిలియాక్ వ్యాధి గురించీ మరిన్ని విషయాలు—

మొదలైన అంశాల మీద- సిరిధాన్యాలు, కాషాయలూ, చెక్క గానుగ నూనెలు వాడుకుంటూ స్వస్థత పొందే మార్గాలు తెలుసుకోండి.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు (5 మిల్లెట్ లు) !

ఆధునిక రోగాలను సిరి ధాన్యాల తో రూపు మాపుదాం !!

For ORGANIC and UNPOLISHED Millets :

Visit www.mymilletzone.wixsite.com/siridhanya

and Facebook page ‘Millet ZONE’

Visit the OUTLET at Shaikpet, on Gachibowli main road at HS Darga circle. Ph 9492935095
or Visit OUTLET at Nallakunta, DD c)olony , Soma Sundar nagar ph nos. 040-27402344 Hyderabad(Evenings)

‘ సిరి ధాన్యాలు ‘ మానవాళి కి వరాలు.  Reviewed by on . కొర్ర బియ్యం, అండు కొర్ర బియ్యం, సామెల బియ్యం, అరికెల బియ్యం, ఊదల బియ్యం ఈ ఐదూ పంచరత్న సిరి ధాన్యాలు ! ఎందుకంటే, సిరి ధాన్యాలే ముఖ్య ఆహారం గా - మీ ఆహారం మీరు తి కొర్ర బియ్యం, అండు కొర్ర బియ్యం, సామెల బియ్యం, అరికెల బియ్యం, ఊదల బియ్యం ఈ ఐదూ పంచరత్న సిరి ధాన్యాలు ! ఎందుకంటే, సిరి ధాన్యాలే ముఖ్య ఆహారం గా - మీ ఆహారం మీరు తి Rating: 0

Related Posts

scroll to top