Friday , 19 July 2019

Home » Slider News » సంక్రాంతికి చంద్ర్రన్న కానుకలు

సంక్రాంతికి చంద్ర్రన్న కానుకలు

December 7, 2018 7:00 pm by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on సంక్రాంతికి చంద్ర్రన్న కానుకలు A+ / A-

chandrababuఆంధ్ర ప్రదేశ్ లో క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక కింద ఆరు వస్తువులతో కూడిన కిట్‌లను ఇవ్వనున్నారు.

కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అరలీటరు పామాయిల్‌, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.400పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వీటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. జిల్లాలో పంపిణీకి సంబంధించి ఈసారి 1,200 టన్నుల గోధుమపిండి, 600 టన్నుల శనగపప్పు, 600 టన్నుల బెల్లం, 600 కిలోలీటర్ల పామాయిల్‌, 150 కిలో లీటర్ల నెయ్యి అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తం సరకుల విలువ దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జిల్లాలో ఉన్న మొత్తం 2,340 రేషన్‌ దుకాణాల ద్వారా ఈ కానుకల కిట్‌ను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12లక్షల98వేల 940మంది కార్డుదారులున్నారు.

సంక్రాంతికి చంద్ర్రన్న కానుకలు Reviewed by on . ఆంధ్ర ప్రదేశ్ లో క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక కింద ఆరు వస్తువులతో కూడిన కిట్‌లను ఇవ్వనున్నారు. కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్ ఆంధ్ర ప్రదేశ్ లో క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక కింద ఆరు వస్తువులతో కూడిన కిట్‌లను ఇవ్వనున్నారు. కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్ Rating: 0
scroll to top