Tuesday , 12 December 2017

Home » Slider News » వై.ఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ షాక్ ఇచ్చిండా ?

వై.ఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ షాక్ ఇచ్చిండా ?

June 23, 2017 7:29 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on వై.ఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ షాక్ ఇచ్చిండా ? A+ / A-

2019 లో సిఎం అయ్యే యోగం లేదా ?

y s jagan బెజవాడ: వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టి జాతీయ పార్టి (ఎపి,తెలంగాణలో పార్టి ఉందిగదా) అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఎపిలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా….లేదనే చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా  మేనేజ్ మెంట్ ఎక్స్ పర్ట్ గా పేరున్న ప్రశాంత్ కిశోర్….ఈ పేరు ఉత్తరాది ఎన్నికల సమయంలో బాగా వినపడిన పేరు. చాలా మంది ప్రముఖులకు ఎన్నికల సమయంలో ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరించి సూచనలు సలహాలు ఇస్తారు. కొందరికి ఆయన ఇచ్చిన సలహాలు ఫలించాయి. కొందరికి ఫలితాలు తిరగ బడ్డాయి. మొత్తానికి డబ్బులకు కొదువ లేని నేతలు ఈయన గారిని ఆశ్రయించి బాగా తగలేస్తుంటారు. 2019 ఎన్నికల్లో తీనే ముఖ్యమంత్రి అవుతానంటూ పదే పదే చెప్పుకునే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రహస్యంగా ప్రశాంత్ కిశోర్ తో ఈ మధ్య ఓ సర్వే చేయించుకున్నాడని వార్తలు వచ్చాయి.

సర్వే లెక్కల్లో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు అంటే.. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో.. టిడిపికి 114 సీట్లు వస్తాయని, 41 శాతం ఓట్లు పడతాయని తేలిందని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49 సీట్లు, 27 శాతం ఓట్లు, జనసేనకు 10కి పైగా సీట్లు, 13 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు, 7 శాతం ఓట్లు పడతాయని తేలిందని తెలుస్తోంది.

ఈ లెక్కలు చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో చాన్స్ చాలా తక్కువేనని చెప్పవచ్చు. అయితే జగన్ ఒంటరిగా వెళితే లాభ లేదని ఇతర పార్టీలతో పొత్తు ఉంటే ఫలితం రావచ్చని కిశోర్ సర్వే చెప్పిందట. ఇక పోతే పవర్ స్టార్ పవన్ కళ్యాన్  విషయంలో పవర్ లేదని ప్రశాంత్ కిశోర్ సర్వేలో తేల్చాడట. ఆయన ఒటరిగా పోటి చేస్తే తెలుగు దేశం పార్టి ఓట్లు చీల్చవచ్చని ఇది కొంత మేరకు జగన్ కు కల్సి రావచ్చని చెప్పారట.
అన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఈ సర్వే కోసం చాలా పెద్ద మొత్తంలో తగలేసినట్లు వార్తలు వచ్చాయి. ఒకటో రెండో కాదు….ఏకంగా  రూ.8.5 కోట్లతో సర్వే చేయించుకున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి.

వై.ఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ షాక్ ఇచ్చిండా ? Reviewed by on . 2019 లో సిఎం అయ్యే యోగం లేదా ?  బెజవాడ: వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టి జాతీయ పార్టి (ఎపి,తెలంగాణలో పార్టి ఉందిగదా) అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఎపిలో ముఖ్ 2019 లో సిఎం అయ్యే యోగం లేదా ?  బెజవాడ: వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టి జాతీయ పార్టి (ఎపి,తెలంగాణలో పార్టి ఉందిగదా) అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఎపిలో ముఖ్ Rating: 0
scroll to top