Thursday , 19 October 2017

Home » Slider News » వెంకయ్యకు ఘనంగా సత్కారం

వెంకయ్యకు ఘనంగా సత్కారం

August 21, 2017 9:00 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on వెంకయ్యకు ఘనంగా సత్కారం A+ / A-

CM KCR Felicitated Vice president Venkaiah Naiduహైదరాబాద్‌: ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా పౌరసన్మానం నిర్వహించింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా వెంకయ్యనాయుడును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్‌ నరసింహన్‌ సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీఎం, గవర్నర్‌తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు

తెలంగాణతో, హైదరాబాద్‌ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. ‘హైదరాబాద్‌ కేంద్రంగా చేసుకొని నేను రాజకీయాల్లో ఎదిగాను. హైదరాబాద్‌ నగరమన్నా, తెలంగాణ ప్రాంతమన్నా నాకు ఎంతో ఇష్టం. తెలంగాణలో నేను పర్యటించని తాలూకా, మండలం లేదంటే అతిశయోక్తి కాదు. అనేక పర్యాయాలు నేను పర్యటించాను. విభిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలు, విభిన్న ప్రజల మేలు కలయిక తెలంగాణ. ఇది ఒక మినీ భారత్‌’ అని వెంకయ్య అన్నారు.

‘మనమందరం తెలుగువాళ్లమే. తెలుగువాళ్లంతా కలిసి ఉండాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉభయకుశలోపరిగా పనిచేయాలి. కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా.. వాటిని కూర్చోని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. ఇద్దరు సీఎంలు కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయాలి’ అని అన్నారు.

వెంకయ్యకు ఘనంగా సత్కారం Reviewed by on . హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా పౌరసన్మానం నిర్వహించింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో వేద పండితుల మం హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా పౌరసన్మానం నిర్వహించింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో వేద పండితుల మం Rating: 0
scroll to top