Saturday , 25 November 2017

Home » Slider News » విడుదలకు సిద్ధమవుతున్న ‘శరణం గచ్ఛామి’

విడుదలకు సిద్ధమవుతున్న ‘శరణం గచ్ఛామి’

March 1, 2017 12:07 pm by: Category: Slider News, సినిమా Leave a comment A+ / A-

SARANAM GACHAMI MOVIEశరణం గచ్ఛామి విడుదలకు ముందే వివాదాస్పమై ప్రాంతీయ సెన్సార్ బోర్డు మోకాళ్ళు అడ్డడంతో ప్రేక్షకుల ముందుకు అనుకున్నసమయంలో రాలేక పోయిన చిత్రం.  వర్తమాన సమాజంలో కుల ప్రాతిపదిక రిజర్వేషన్ల సమస్య ఇతి వృత్తంగా తీసిన చిత్రం. విడుదల అవుతుందో కాదో అనుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వటానికి ప్రాంతీయ సెన్సార్‌బోర్డ్‌ కార్యాలయం అంగీకరించక పోవడంతో ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం పై దాడి కూడ జరిగింది.  సోషల్ మీడియాలో ఈ చిత్రం బాగా ప్రచారం అయింది. సినిమా కథ గురించే కాక ఇంకా అనేక విశేషాలు  సోషల్ మీడియాలో అప్ డేట్ చేశారు.  

     శరణం గచ్ఛామి’ చిత్రంలో ఫస్టా‌ఫ్ లో కేలేజి కాంపస్ లైఫ్ ఉంటుంది.  సినిమా హీరో ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అన్ని సినిమాలలో మాదిరిగానే ఇందులో కూడ కాలేజీ జీవితం, ప్రేమాయణం అన్ని ఉన్నాయి.

ఎస్‌సి, ఎస్టీ, బిసీ వర్గాలు పడే సమస్యల్ని ఇందులో ప్రస్తావించారు. మొత్తానికి రిజర్వేషన్ల సమస్యపై ఈ సినిమాలో చర్చ జరిగింది. రిజర్వేషన్లపై హీరో అంతర్మధనం మొదలై తన స్వీయ పరిశోదనతో విశ్లేషణ చేయడమే చిత్రం క్లైమాక్స్. ఇప్పటికే పలువురు సామాజిక వేత్తలకు రాజకీయ నాయకులకు విద్యార్థులకు సినిమా ప్రివ్యూ చూపించారు. మంత్రి హీరీశ్ రావు సినిమా చూసి బాగుందన్నారు. అయితే ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత వారి స్పందన ఏమిటో చూడాలి. ఇలాంటి సినిమాలు తీసేందుకు ఎవరూ సాధారణంగా సాహసం చేయరు. దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ చాలా శ్రమ పడి సినిమా తీసాడు.

తుది పరిశీలనాంతరం సెన్సార్ రివైజింగ్‌ కమిటీ ఈ సినిమాకు యు,ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.  విడుదలకు ముందే సెన్సార్ బోర్డు అడ్డుకోవడంతో వివాదాస్పదం అయిన ఈ సినిమా కార్పోరేట్ హంగులు సంతరించుకున్న ప్రస్తుత ట్రెండ్ లో ఎంత వరకు మెప్పు పొందుతుందో చూడాలి.

 

విడుదలకు సిద్ధమవుతున్న ‘శరణం గచ్ఛామి’ Reviewed by on . ‘శరణం గచ్ఛామి’ విడుదలకు ముందే వివాదాస్పమై ప్రాంతీయ సెన్సార్ బోర్డు మోకాళ్ళు అడ్డడంతో ప్రేక్షకుల ముందుకు అనుకున్నసమయంలో రాలేక పోయిన చిత్రం.  వర్తమాన సమాజంలో కుల ‘శరణం గచ్ఛామి’ విడుదలకు ముందే వివాదాస్పమై ప్రాంతీయ సెన్సార్ బోర్డు మోకాళ్ళు అడ్డడంతో ప్రేక్షకుల ముందుకు అనుకున్నసమయంలో రాలేక పోయిన చిత్రం.  వర్తమాన సమాజంలో కుల Rating: 0

Related Posts

Leave a Comment

scroll to top