Saturday , 24 August 2019

Home » Slider News » లగడ పాటి సర్వేలపై తెరాస మండి పాటు…ఇసికి ఫిర్యాదు

లగడ పాటి సర్వేలపై తెరాస మండి పాటు…ఇసికి ఫిర్యాదు

December 1, 2018 8:25 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on లగడ పాటి సర్వేలపై తెరాస మండి పాటు…ఇసికి ఫిర్యాదు A+ / A-

lagadapati rajagopalతెలంగాణతో పెట్టుకుని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడ పాటి రాజగోపాల్ పేరుకు సన్యాసం అయినా ఆయన నిత్యం రాజకీయ వార్తల్లోనే నానుతున్నాడు. ఎన్నికల సమయంలో ఆయన తలపెట్టే  సర్వేల తంతుకు విపరీత మైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికలపై నోరు తెరవని లగడ పాటి రాగోపాల్ హఠాత్తుగా బాంబు పేల్చాడు. తెలంగాణలో హంగ్ ఏర్పడ బోతోందని లగడ పాటి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అన్యాపదేశంగా చెప్పాడు. అంతే కాదు ఈ ఎన్నికల్లో 8 నుండి 10 మంది ఇండిపెండెంట్ లు గెలవ బోతున్నారని జోస్యం చెప్పాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుండి అనిల్ యాదవ్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోని నారాయణ పేట నుండి శివకుమార్ గెలవ బోతున్నట్లు చెప్పాడు. వీరిద్దరూ ఇండిపెండెంట్ అభ్యర్థులు. లగడ పాటి సర్వే జోస్యంతో తెలంగాణ రాష్ర్ట సమితి పార్టి మండి పడుతోంది. ఇక నుండి రోజుకో ఇద్దరు గెలిచే అభ్యర్థులు అది ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తానని లగడ పాటి పేర్కొన్నాడు. పోలింగ్ జరిగిన డిసెంబర్ 7వ తేది సాయంత్రం సర్వే పూర్తి ఫలితం వెల్లడిస్తానని కూడ ఆయన చె్ప్పాడు. లగడ పాటి సర్వే విషయం అటు సోషల్ మీడియాలో ను ఇటు మెయిన్ స్ర్టీమ్ మీడియాలోను వైరల్ గా మారింది.

ఈ సార ిఎన్నికల్లో తెరాసకు అత్యధిక సీట్లు వస్తాయని  జాతీయ మీడియా సంస్థలు అనేకం అనేక సార్లు సర్వేలు చేసి ప్రకటించాయి. వాటిపై లేని అభ్యంతరాలు లగడ పాటి సర్వేపై తెరాసకు ఎందుకో తెలియదు. అనుకూల సర్వేలన్ని తెరాస మేనేజ్ చేసినవే ననే విమర్శలు వచ్చాయి. ఎన్నికల సభల్లో కూడ పలు సంధర్భాలలో సర్వేల ఫలితాలు తమకు అనూకూలంగ ాఉన్నాయని ,స్వయంగా అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం విశేషం. కాని లగడ పాటి సర్వేలు కొంప ముంచేట్లు ఉన్నాయని తెరాసలో ఆందోళన మొదలైంది. ఎన్నికల నియమ నిభందనలకు ఇది విరుద్దమంటూ తెరాస నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

లగడ పాటి సర్వేలపై తెరాస మండి పాటు…ఇసికి ఫిర్యాదు Reviewed by on . తెలంగాణతో పెట్టుకుని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడ పాటి రాజగోపాల్ పేరుకు సన్యాసం అయినా ఆయన నిత్యం రాజకీయ వార్తల్లోనే నానుతున్నాడు. ఎన్నికల సమయంలో ఆయన తలపెట్టే తెలంగాణతో పెట్టుకుని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడ పాటి రాజగోపాల్ పేరుకు సన్యాసం అయినా ఆయన నిత్యం రాజకీయ వార్తల్లోనే నానుతున్నాడు. ఎన్నికల సమయంలో ఆయన తలపెట్టే Rating: 0
scroll to top