Sunday , 16 December 2018

Home » Slider News » లగడ పాటి గడబిడ సర్వే……కూటమికి 65 టిఆర్ఎస్ కు 35

లగడ పాటి గడబిడ సర్వే……కూటమికి 65 టిఆర్ఎస్ కు 35

December 7, 2018 7:20 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on లగడ పాటి గడబిడ సర్వే……కూటమికి 65 టిఆర్ఎస్ కు 35 A+ / A-

 

  • AGADAPATI RAJAGOPAL PHEKHARమహాకూటమికి 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలు

  • టీఆర్ఎస్ కు 10 స్థానాలు అటూఇటుగా 35 స్థానాలు

  • బీజేపీకి 2 స్థానాలు అటూఇటుగా 7 సీట్లు

ఆంధ్ర ఆక్టోపస్ లగడ పాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించారు. అయితే ఈ సారి ఆయన వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లోగడబిడ కనిపించింది. లెక్కింపు జరిగే 11 వ తేదికి ముందు మరోసారి సర్వేచేస్తానని తెలిపారు.  ఆయన సర్వే మేరకు అధికార టిఆర్ ఎస్ పార్టీ అధికారం నిలుపు కోవడం కష్టమేనని అన్నారు. కూటమికి అత్యధికంగా 65 స్థానాలు టిఆర్ఎస్ కు 35 స్థానాలు వస్తాయని అన్నారు. ఎంఐఎం పార్టీకి 6 నుండి7 సీట్లు వస్తాయన్నారు.

ఆయితే ఈ సారి తెలంగాణ ప్రజల నాడి తెల్సుకోవడం చాలాకష్టంగా మారిందని అన్నారు. గత మూడు నెలల నుండి సర్వేల మీద సర్వేలు జరిపామని తెలిపారు.   గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని  లగడపాటి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. రెండు పక్షాలు కూడా అనేకమైన వాగ్దానాలు చేశాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండు పక్షాలపై ప్రేమ, జాలి, కసి అన్నీ ప్రజల్లో కనపడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి రెండు 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ 10 స్థానాలు అటూ ఇటుగా 35 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంటుందని తెలిపారు.

టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో రెండు స్థానాలు అటూఇటుగా 7 గెలుస్తుందని లగడపాటి చెప్పారు. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలస్తారని ముందే చెప్పానని తెలిపారు. టీడీపీ పోటీ చేస్తున్న మరో స్థానంలో ఎంఐఎం బలంగా ఉందని అన్నారు. ఎంఐఎంకు 6 స్థానాలు వస్తాయని చెప్పారు. సీపీఎం ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉదని చెప్పారు. బీజేపీ రెండు స్థానాలు అటూఇటుగా 7 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఇండిపెండెంట్లు 2 స్థానాలు అటూ ఇటుగా 7 స్థానాలను గెలుచుకుంటారని అన్నారు.

తన ఎగ్జిట్ ఫలితాలపై లగడ పాటి క్లారిటి ఇస్తూ ఖచ్చితమైన ఫలితాల కోసం మరో సారి పోస్ట్ పోల్ నిర్వహిస్తానని తెలిపారు. ఎర్రర్

జాతీయ మీడియా అంచనాలు తప్పని గతంలో తేలాయి

జాతీయ మీడియాసంస్థలు చాలావరకు టిఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పాయని లగడ పాటిని మీడియా  ప్రశ్నించగా అవన్ని నార్త్ కు సంభందించిన సంస్థలని గతంలో వాటి అంచనాలు తప్పాయని అన్నారు. తమిళనాడు, కర్నాటకలో ఆయా సంస్థల అంచనాలు పూర్తిగా తప్పని తెలిందని అ్ననారు.

 

లగడ పాటి గడబిడ సర్వే……కూటమికి 65 టిఆర్ఎస్ కు 35 Reviewed by on .   మహాకూటమికి 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలు టీఆర్ఎస్ కు 10 స్థానాలు అటూఇటుగా 35 స్థానాలు బీజేపీకి 2 స్థానాలు అటూఇటుగా 7 సీట్లు ఆంధ్ర ఆక్టోపస్ లగడ పాటి రా   మహాకూటమికి 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలు టీఆర్ఎస్ కు 10 స్థానాలు అటూఇటుగా 35 స్థానాలు బీజేపీకి 2 స్థానాలు అటూఇటుగా 7 సీట్లు ఆంధ్ర ఆక్టోపస్ లగడ పాటి రా Rating: 0
scroll to top