Monday , 20 May 2019

Home » Slider News » లక్నవరం జలాశయానికి మరో అందం-రెండో వేలాడే వంతెన

లక్నవరం జలాశయానికి మరో అందం-రెండో వేలాడే వంతెన

November 16, 2018 6:43 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on లక్నవరం జలాశయానికి మరో అందం-రెండో వేలాడే వంతెన A+ / A-

Laknavaram Second bridgeజయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్నవరం జలాశయానికి మరో అందం తోడైంది. జలాశయం వద్ద రెండో వేలాడే వంతెనను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ బోయినపల్లి మనోహర్‌ గురువారం  ప్రారంభించారు. రెండవ వంతెన కూడా ఉపయోగంలోకి రావడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వంతెనను 5 కోట్ల రూపాయలతో రూపొందించింది.  ప్రారంభోత్సవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత గిరీష్‌ భరద్వాజ్‌ పాల్గొన్నారు. కొత్త వారధిపై ఒకేసారి 1000 మంది పర్యాటకులు నడవొచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న వేలాడే వంతెన వల్ల పర్యటకులు అధికంగా వస్తున్నారని …ఇప్పుడు మరో వంతెన జతకావడంతో పర్యాటకం మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెప్పారు.

లక్నవరం జలాశయానికి మరో అందం-రెండో వేలాడే వంతెన Reviewed by on . జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్నవరం జలాశయానికి మరో అందం తోడైంది. జలాశయం వద్ద రెండో వేలాడే వంతెనను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ బోయినపల్లి మనోహర్‌ గ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్నవరం జలాశయానికి మరో అందం తోడైంది. జలాశయం వద్ద రెండో వేలాడే వంతెనను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ బోయినపల్లి మనోహర్‌ గ Rating: 0

Related Posts

scroll to top