Saturday , 24 August 2019

Home » Slider News » రేవంత్ రెడ్డికి భద్రత కల్పించండి..హైకోర్టు

రేవంత్ రెడ్డికి భద్రత కల్పించండి..హైకోర్టు

December 1, 2018 9:01 am by: Category: Slider News, తెలంగాణ Comments Off on రేవంత్ రెడ్డికి భద్రత కల్పించండి..హైకోర్టు A+ / A-

Revant Reddyతనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని, నిరంతరం తన వెంట నలుగురు భద్రతాసిబ్బంది ఉండేలా.. తనకు భద్రత కల్పించాలని టీపీసిసి కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి గతంలో హైకోర్టును విన్నవించారు. నిజానిజాలు తెలుసుకొని దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం కేంద్రం భద్రత కల్పించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయినా తనను పట్టించుకోవటం లేదని రేవంత్‌రెడ్డి గురువారం ఆరోపించారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి భద్రత అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెబుతూ ఈ మేరకు 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ ఈ భద్రతను కొనసాగించాలని సదరు ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

రేవంత్ రెడ్డికి భద్రత కల్పించండి..హైకోర్టు Reviewed by on . తనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని, నిరంతరం తన వెంట నలుగురు భద్రతాసిబ్బంది ఉండేలా.. తనకు భద్రత కల్పించాలని టీపీసిసి కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు రేవంత్‌ రెడ తనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని, నిరంతరం తన వెంట నలుగురు భద్రతాసిబ్బంది ఉండేలా.. తనకు భద్రత కల్పించాలని టీపీసిసి కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు రేవంత్‌ రెడ Rating: 0
scroll to top