Sunday , 16 December 2018

Home » Slider News » రామచిలకలు పంపుతా… జోస్యం చెప్పుకో…లగడ పాటికి కెటిఆర్ సలహా

రామచిలకలు పంపుతా… జోస్యం చెప్పుకో…లగడ పాటికి కెటిఆర్ సలహా

December 6, 2018 10:16 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on రామచిలకలు పంపుతా… జోస్యం చెప్పుకో…లగడ పాటికి కెటిఆర్ సలహా A+ / A-

ktr and lagadapatiపెప్పర్ స్ప్రే  లగడ పాటి రాజగోపాల్ సర్వే టిఆర్ఎస్  కు వ్యతిరేకంగా రావడంతో తెరాస పార్టి  వర్గాలకు మింగుడు పడడం లేదు. లగడ పాటి సర్వేతప్పని కెటిఆర్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని అన్నారు. గ్రేటర్ లోని 24 సీట్లలో 17 తమవేనని, మొత్తం మీద 100 సీట్లు గెలవడం ఖాయమని తెలిపారు. లగడ పాటికి తానురెండు రామచిలుకలు పంపిస్తానని ఆయన చిలక జోస్యం చెప్పుకోవాలని సలహా ఇచ్చారు. 11వ తేదీన వెలువడే ఫలితాలతో లగడపాటికి దిమ్మ తిరిగిపోతుందని అన్నారు. సర్వే చేయాలని తానే లగడ పాటిని కోరింది వాస్తవమని అంగీకరించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రస్తావన తేగా తామే తిరస్కరించామని చెప్పారు.

మీడియా సంస్థల అధిపతులు, చంద్రబాబు, లగడపాటి కలసి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న సర్వే ఫలితాలను మార్చివేశారని కేటీఆర్ ఆరోపించారు. కొన్ని దినపత్రికలు రంగును మార్చుకున్నాయని, తమకు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలిసిపోయిందని అన్నారు. 11వ తేదీన ఫలితాలు వెల్లడైన తరువాత ఆ ఇద్దరు మీడియా అధిపతుల పేర్లనూ తాను వెల్లడిస్తానని అన్నారు. అకస్మాత్తుగా న్యూస్ పేపర్లు ప్రజా కూటమికి మద్దతు పలికాయని, గతంలోనూ చంద్రబాబు టీఆర్ఎస్ ను అస్థిర పరిచే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు సమయంలోనూ ఈ మీడియా సంస్థలు చంద్రబాబుకు అండగా ఉన్నాయని, 12న తాను మీట్ ది ప్రెస్ లో పాల్గొని వారి బండారాన్ని బయటపెడతానని అన్నారు.

రామచిలకలు పంపుతా… జోస్యం చెప్పుకో…లగడ పాటికి కెటిఆర్ సలహా Reviewed by on . పెప్పర్ స్ప్రే  లగడ పాటి రాజగోపాల్ సర్వే టిఆర్ఎస్  కు వ్యతిరేకంగా రావడంతో తెరాస పార్టి  వర్గాలకు మింగుడు పడడం లేదు. లగడ పాటి సర్వేతప్పని కెటిఆర్ పేర్కొన్నారు. ట పెప్పర్ స్ప్రే  లగడ పాటి రాజగోపాల్ సర్వే టిఆర్ఎస్  కు వ్యతిరేకంగా రావడంతో తెరాస పార్టి  వర్గాలకు మింగుడు పడడం లేదు. లగడ పాటి సర్వేతప్పని కెటిఆర్ పేర్కొన్నారు. ట Rating: 0
scroll to top