Friday , 19 July 2019

Home » NEW » రాగులు తింటే రారాజులాగా ఆరోగ్యం

రాగులు తింటే రారాజులాగా ఆరోగ్యం

December 16, 2016 6:00 am by: Category: NEW Leave a comment A+ / A-

ragulu-healthరాగి జావ, రాగి సంగటి, రాగులతో చేసిన రకరకాల పిండివంటలు తయారు చేసుకుని తింటే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. రాగులు శరీరానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ.. ఎంతో బలవర్థకమైన ఆహారం రాగులు. విభిన్న రూపాల్లో రాగులను.. ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ప్రొటీన్స్, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. రాగుల వల్ల జుట్టు వత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

రాగులలో లో ఫ్యాట్ తక్కువగా ఉండటమే కాదు.. ఇవి త్వరగా జీర్ణమవుతాయి.

ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలానికి తోడ్పడతాయి. పిల్లల ఎదుగుదలకు సహకరిస్తాయి. వయస్సు పెరుగుతున్న వారికి సరైన మోతాదులో కాల్షియం అందించడానికి రాగులు సహాయపడతాయి. మహిళల ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ తాగడం మంచిది.

ఓఅధ్యయనం ప్రకారం బియ్యం, గోధుమల్లో కన్నా రాగుల్లో పీచుశాతం అధికమని తేలింది. కాలేయంలో చేరిన అధిక కొవ్వు తగ్గించి .పరోక్షంగా కొలెస్ట్రాల్‌ సమస్య నూ అదుపులో ఉంచుతాయి.. రాగుల్లో సమృద్ధిగా లభించే ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. రాగి ఆహారాన్ని ప్రతిరో జు గనుక తీసుకుంటే పోషకాహరలేమి,వార్ధక్యపు లక్షణాలు దరి చేరవు

రాగులు తింటే రారాజులాగా ఆరోగ్యం Reviewed by on . రాగి జావ, రాగి సంగటి, రాగులతో చేసిన రకరకాల పిండివంటలు తయారు చేసుకుని తింటే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. రాగులు శరీరానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. రాగి జావ, రాగి సంగటి, రాగులతో చేసిన రకరకాల పిండివంటలు తయారు చేసుకుని తింటే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. రాగులు శరీరానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. Rating: 0
scroll to top