Friday , 19 July 2019

Home » Slider News » రజనీ కాంత్ 2.O మూవీ కలెక్షన్లు బాహుబలి, సర్కార్ రికార్డులు బ్రేక్ చేశాయా ?

రజనీ కాంత్ 2.O మూవీ కలెక్షన్లు బాహుబలి, సర్కార్ రికార్డులు బ్రేక్ చేశాయా ?

December 1, 2018 8:54 am by: Category: Slider News, సినిమా Comments Off on రజనీ కాంత్ 2.O మూవీ కలెక్షన్లు బాహుబలి, సర్కార్ రికార్డులు బ్రేక్ చేశాయా ? A+ / A-

2.0 సినిమాసూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.O మూవీ తమిళనాడులో వసూళ్ల మోత మోగించింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2డీ, 3డీ వెర్షన్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ముందుకెళ్తున్నది. తొలిరోజు కలెక్షన్లు బాహుబలి2, సర్కార్, ఇతర తమిళ చిత్రాల వసూళ్లను అధిగమించిందనే టాక్ వచ్చింది.

తమిళనాడు వ్యాప్తంగా మల్టిప్లెక్స్ చైన్ థియేటర్లలో భారీ సంఖ్యలో సినిమాను ప్రదర్శించారు. ఎస్‌పీఐ సినిమాస్‌లో 110కి పైగా, పీవీఆర్‌లో 90 షోలకు పైగా, ఏజీఎస్ 80కిపైగా, రోహిణి సినిమాస్‌లో 34 షోలకుపైగా, ఐనాక్స్‌లో 34 షోలకు పైగా, కాసీ టాకీస్‌లో 24 షోలకుపైగా, దేవీ, లక్స్ థియేటర్లలో 30కి పైగా స్క్రీన్లలో ప్రదర్శించారు.

తమిళనాడులో 2.O మూవీ చిత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. తొలిరోజే రూ.35 కోట్లు వసూలు చేసి టాప్ 1 పొజిషన్‌ను నిలబెట్టుకొన్నది. మిగితా సినిమాల కలెక్షన్లు పరిశీలిస్తే.. తమిళనాడులో సర్కార్ రూ.3.15, మెర్సల్ రూ.24.8, కబాలి రూ.21.5, వేదాలం రూ.15.5, తేరి రూ.13.23 కోట్లు వసూలు చేశాయి.

రజనీ కాంత్ 2.O మూవీ కలెక్షన్లు బాహుబలి, సర్కార్ రికార్డులు బ్రేక్ చేశాయా ? Reviewed by on . సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.O మూవీ తమిళనాడులో వసూళ్ల మోత మోగించింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2డీ, 3డీ వెర్షన్లలో రిలీజైంది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.O మూవీ తమిళనాడులో వసూళ్ల మోత మోగించింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2డీ, 3డీ వెర్షన్లలో రిలీజైంది Rating: 0
scroll to top