Tuesday , 16 October 2018

Home » Slider News » యుద్ధం జరిగితే వినాశనమే:అమెరికా

యుద్ధం జరిగితే వినాశనమే:అమెరికా

August 18, 2017 7:59 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on యుద్ధం జరిగితే వినాశనమే:అమెరికా A+ / A-

war and peace America వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదు. కానీ, అమెరికా చేసే అణుదాడి తర్వాత ఉత్తరకొరియా, దక్షిణకొరియాలతోపాటు జపాన్‌లోనూ శవాల గుట్టలే కనిపిస్తాయని అలా జరగడం తమకు ఇష్టం లేదని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జాన్ మాటిస్ అన్నారు. అణు దాడులు ప్రపంచ వినాశనానికి కారణమవుతాయని అంతకు మించి వాటితో సాధించేదేమి ఉండదని ఆయన హితవు పలికారు.

అంతేకాదు ఈ విషయాన్ని గుర్తించి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌వున్ కొంత వరకు వెనక్కు తగ్గడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అణుదాడి జరిగితే ఉత్తరకొరియా, దక్షిణకొరియాల్లో రెండు పక్కల అర నిమిషానికి 30 వేల మంది ప్రజలు ప్రాణాలు కొల్పోతారని ఆయన అన్నారు. అలా లెక్కిస్తే అరగంటలో 10 కోట్ల మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని మాటిస్ చెబుతున్నారు. ఉత్తరకొరియా పక్క దేశాలపై కూడా అణుదాడి ప్రభావం ఉంటుందని అలాగే అమెరికా కూడా ఆ ముప్పును ఎదుర్కొంటుందని అలా జరగకపోవడమే మంచిదని ఆయన కోరుకున్నారు.

యుద్ధం జరిగితే వినాశనమే:అమెరికా Reviewed by on . వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదు. కానీ, అమెరికా చేసే అణుదాడి తర్వాత ఉత్తరకొరియా, దక్షిణకొరియాలతోపాటు జపాన్‌లోనూ శవాల గుట్టల వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదు. కానీ, అమెరికా చేసే అణుదాడి తర్వాత ఉత్తరకొరియా, దక్షిణకొరియాలతోపాటు జపాన్‌లోనూ శవాల గుట్టల Rating: 0
scroll to top