Friday , 19 July 2019

Home » Slider News » మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించిన కెసిఆర్

మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించిన కెసిఆర్

January 1, 2019 7:06 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించిన కెసిఆర్ A+ / A-

kcrప్రాజెక్టుల బాటలో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించారు. బ్యారేజి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యంపై సిఎం అసంతృప్తివ్యక్తం చేశారు. పనులుప్రతి రోజు తాను స్వయంగా పరిసీలిస్తానని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  ఎక్కువ సేపు మేడిగడ్డ వద్ద గడిపి అధికారులతో చర్చించారు. మేడిగడ్డ  అనంతరం కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శించారు.

సీఎం వెంట ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , బూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. మధిని ఎమ్మెల్యే దుద్దిళ్ళ, శ్రీధర్ బాబు,  జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను, వర్క్ ఏజెన్సీలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజి పనులను పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించిన కెసిఆర్ Reviewed by on . ప్రాజెక్టుల బాటలో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించారు. బ్యారేజి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యంప ప్రాజెక్టుల బాటలో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించారు. బ్యారేజి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యంప Rating: 0
scroll to top