Friday , 16 November 2018

Home » Slider News » మరోసారి ఊపునిచ్చిన సభలు  స్ఫూర్తి నింపిన అల్లమన్న 

మరోసారి ఊపునిచ్చిన సభలు  స్ఫూర్తి నింపిన అల్లమన్న 

May 21, 2018 7:05 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on మరోసారి ఊపునిచ్చిన సభలు  స్ఫూర్తి నింపిన అల్లమన్న  A+ / A-

తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా, మీడియా అకాడమీ చైర్మన్ గా  అల్లమన్న కృషిని సభ గుండెలకు హత్తుకున్నది. 

వివిధ జిల్లాల నుంచి నాలుగు వేలకు పైగా ప్రతినిధులు ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన సభకు హాజరై, తెలంగాణా రాష్ట్ర సాధన అనంతరం పాత్రికేయులు సాధించుకున్నవి, ఇక ముందు సాధనకు పూనుకోవలసినవి సమీక్షుంచుకొని సరికొత్త కార్యాచరణ ప్రకటించుకున్నది.
నాయకత్వం అవతలి పక్షం విమర్శలకు దీటుగా జవాబులు చెప్పడమే కాదు, తెలంగాణా రాక ముందు పరిస్థితి, వచ్చాక జరిగిన మార్పు గురించి  సవివరంగా అర్థం చేసుకొని, స్వరా ష్ట్రం లో మన యూనియన్ చేసింది తక్కువేమీ కాదు, ఘనంగా చెప్పుకోవడానికి మనకు అన్ని అర్హతలూ ఉన్నాయని సభ అభిప్రాయపడింది. నూతన స్పూర్తితో ప్రతినిధులు తిరిగి వెళ్ళారు.
జర్నలిస్టుల మూల నిధి నలభై కోట్లు, ఇంత అన్న పరిమితి తో నిమ్మితం లేకుండా హెల్తు కార్డులు,  దేశంలోనే మొదటిసారిగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిదిఅశన్లు, మరణించిన జర్నలిస్టుల కుటుంభాలకు లక్ష రూపాయల వితరణ, ఐదేళ్ళ పాటు పిల్లలకు కొంత ఆర్ధిక తోడ్పాటు, ఇవి కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు కోట్లకు పైగా విలేకరులకు ఆర్థిక సహాయం ఇప్పించడం, ఇవన్నీ చర్చకు వచ్చాయి.
రాష్ట్రంలోని ఇరవై వేల మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడం, ముఖ్యంగా హైదరాబాద్ వాసుల సుదీర్ఘ కోరిక తీర్చడం చర్చకు వచ్చింది. సెప్టెంబర్ లోగా ఈ సమస్య  పరిశాకరం అయ్యేలా నాయకత్వం నడుం బిగించింది.
ఇద్దరు నాయకులు ప్రజా ప్రతినిధులుగా వచ్చే శాసన సభ కు పోటీ చేయాలనుకుంటే అది వారి వ్యక్తి గత విష్యం అని,  నిజానికి  వారు పాత్రికేయుల తరపునే ఉంటె ఇంకా బాగుంటుందని, అని, తాను మాత్రం విలేకరుల వెంటే ఉంటానని, విలేకరులే నాయకులని, సంఘం  కోసం రాజకీయాలు లేకుండా, తాను పాత్రికేయుల సంక్షేమానికి కట్టుబడి, నిబద్దతతో పని చేస్తానని, అల్లమన్న మరో సారి నొక్కి చెప్పారు. ప్రతినిధులకు విశ్వాసం కలిగించారు.
తెలంగాణా జర్నలిస్టు ల ఫోరం నుంచి ఆవిర్భవించిన యూనియన్ ఇది అని, పోరాట వారసత్వం దీని బలం అని, తెలంగాణా కోసం తెలంగాణా విలేకరులు నిలబడుతారని కూడా అన్న యాది చేస్తూ, భయం అక్కర్లేదని, నాలుగు వేలకు పైగా వచ్చిన ప్రతినిధులకు అభయం ఇచ్చి, మునుపటి ఉచ్చాహం, ఊపు పంచి, సభకు స్పూర్తినిచ్చారు.
ఈ సందర్భంగా బోజన విరామానికి ముందు  అల్లమన్న కీలకోపన్యాసం చిత్రాలు ఇవి.
-కందుకూరి రమేష్ బాబు 
20-05-2018
మరోసారి ఊపునిచ్చిన సభలు  స్ఫూర్తి నింపిన అల్లమన్న  Reviewed by on . తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా, మీడియా అకాడమీ చైర్మన్ గా  అల్లమన్న కృషిని సభ గుండెలకు హత్తుకున్నది.  వివిధ జిల్లాల నుంచి నాలుగు వేలకు పైగా ప్రత తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా, మీడియా అకాడమీ చైర్మన్ గా  అల్లమన్న కృషిని సభ గుండెలకు హత్తుకున్నది.  వివిధ జిల్లాల నుంచి నాలుగు వేలకు పైగా ప్రత Rating: 0
scroll to top