Tuesday , 25 June 2019

Home » NEW » మధుమేహం టైపు 2 -సిరి ధాన్యాలు -కషాయాలు :

మధుమేహం టైపు 2 -సిరి ధాన్యాలు -కషాయాలు :

November 18, 2018 7:23 pm by: Category: NEW, Slider News Comments Off on మధుమేహం టైపు 2 -సిరి ధాన్యాలు -కషాయాలు : A+ / A-

నేడు మీరిక మధు మేహానికి బానిసలు కానక్కర లేదు : ఆరోగ్యాన్ని కాపాడుకోండి ! What a relief !

Dr Khadar Vali milletsనేడు భారత దేశం లో 7 నుండి 10 కోట్ల ప్రజలకు DIABETES-2 సోకింది. (కొందరు నిపుణులు దీనికి రెండింతలు సంఖ్య ను చెప్తారు ప్రీ-Diabetics ని కూడా చేర్చి ).వీరంతా నెల నెల మందుల పై ఎంత ఖర్చు పెడతారో ఊహించండి. కాల క్రమేణా మందులు దాటి ఇన్సులిన్ ఇంజక్షన్ ల వైపు, ఇంకా అది దాటి కిడ్నీ సంబంధ సర్జరీ లకు కొన్ని పదుల లక్షల రూపాయల ఖర్చు వైపు వెళ్లాల్సి వస్తుంది.
ప్రతీ సంవత్సరం మధుమేహ రోగులు రోగాన్ని ఉపశమనం చేసుకునేందుకు ఖర్చు పెడ్తున్న సోమ్ము అక్షరాలా… 825 బిల్లియను డాలర్ లు. Cost of diabetes hits 825 billion dollars a year !!

మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు కొన్ని:

తీవ్రత తో కూడిన జీవన శైలి, ఆత్మీయుల మరణం , ఉద్రేకాలు, ఉద్వేగాలు; emotions, వ్యాపారం లో నష్టాలూ, ప్రేమ వైఫల్యాలు , పట్టుదలలూ, ఆవేశాలు, పంతం తో బ్రతకటం, తీవ్ర అవమానాలకు గురికావడం
మైదా, రిఫైన్డ్ కల్తీ నూనెలూ, తెల్ల చక్కర పదార్థాల వాడకం,
పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారం గా సేవించడం,
అధికం గా తెల్ల చక్కర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ ల సేవనం,
వందల కొద్దీ రసాయనాలు వేసిన -ప్యాక్ చేసిన ఆహారాలు కొనుక్కొని తినడం,
క్లోమ గ్రంధి ని ఆవహించిన ఇన్ఫెక్షన్ లూ,
అంటి బయాటిక్ ల విపరీతఫలితాలు ఇందుకు చెప్పుకో దగ్గ కొన్ని కారణాలు.

గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ‘మధు మేహం’ మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. అది కళ్ళ కూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హృదయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదడు కూ కూడా రోగాలు తెచ్చి పెడ్తుంది.

‘మధుమేహం2’ – ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు పది సూత్రాలు:

  1. i) 8 నుండి 5% పీచు పదార్థం లేదా ఫైబర్ కలిగిన ‘సిరి ధాన్యాలను’ (5 మిల్లెట్ లు) ముఖ్య ఆహారం గా స్వీకరించడం. రెండు రోజులకు ఒక ధాన్యం చొప్పున మార్చుకుంటూ, ఐదు ధాన్యాలనూ ఒక ఆవర్తనం గ త్రిప్పుకుంటూ తినటం పాటించాలి.

వరి, గోధుమల లో పీచు పదార్థం/ఫైబర్ ౦.2 నుండి 1.2 మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది.
కానీ సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే.
రోజు కొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి.(అదే ధాన్యాన్ని). ఒక్కొక్క ధాన్యం రెండు రోజుల పాటు తినాలి.
వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు.
కుటుంబం లో అందరికీ చిన్న నాటి నుండే వీటి యందు అవగాహన పెంచటం.

  1. ii) రోజూ 60 నుండి 75 నిముషాలు నడవటం.

iii ) కషాయాలు : జామ, రావి, పారిజాతం కషాయాలను మూడు పూటలా సాధ్యమైనంత ఖాళీ కడుపు పై త్రాగటం. ఒక్కొక్క వారం పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లలో, ఖాళీ కడుపు మీద వీటి కషాయాలు సేవించాలి. ( కషాయం : గ్లాసున్నర నీటి లో 6 -7 ఆకులను/2 గుప్పెడుల పూలను చిన్న ముక్కలుగా చేసుకుని 4 నిమిషాలపాటు ఉడికించి, గోరువెచ్చగా, వడకట్టుకుని త్రాగాలి. అవసరమనుకుంటే, శుద్ధమైన తాటి బెల్లపు లేత పాకం చేసుకుని 2-3 చుక్కలు కషాయాలకు కలుపుకోవచ్చు )వారానికి ఒకటి చొప్పున మార్చుకోవాలి.

అధికం గా ఆకూ కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపం లో తినడం.

iv ) మునగ ఆకూ, కాయలూ, మెంతులూ, మెంతికూర, ఆలో వేరా, కాకర కాయ, బెండ కాయ, జామ కాయ, ముల్లంగి, అరటి కాయ, శనగలూ, పెసలూ తరచుగా వాడుకోవటం. రెండు బెండకాయల ముక్కలు గ్లాస్సెడు నీటి లో రాత్రి నానబెట్టి ప్రొద్దున్నే ఆ నీటిని త్రాగటం, ముక్కలు తినటం. రోజులో ఎదో ఒక సమయం లో రెండు చెంచాల మెంతి పిండి తినడం .

v ) పాల వాడకం మానివేయడం.పెరుగు, మజ్జిగ ల రూపంలోనే వాటిని స్వీకరించటం. కొని తినే ప్యాకెడ్ ఆహారాలను దూరం పెట్టడం,
కాఫీ, టీ, అల్కోహాల్ ల ను దూరం గా ఉంచటం

  1. vi) మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనె లను దూరం గా ఉంచడం, గానుగ నూనెలో, organic cold-pressed నూనెలో వాడుకోవడం.

vii ) మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం.

viii ) వరి అన్నం, గోధుమలు, మైదా పదార్థాలూ పూర్తి గా దూరం గా ఉంచడం.

ix ) HFCS హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ , తెల్ల చక్కర లు వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను రక్షించుకోవడం,

  1. x) మధు మేహం2 – అందరికీ వచ్చేదే కదా అనే ‘అల్ప ధోరణి’ లేకుండా ఈ వ్యాధిని శాశ్వతం గా దూరం గా ఉంచే మార్గాలు పాటించడం, వ్యాధి వస్తే తప్పక సరైన ఆహారం, మారిన జీవన శైలి తో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంట కీ readings కాకుండా HbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయం గా సరైన పద్దతి లో తెలుసుకోండి

To learn more about these methods for various ailments, read ‘sirilokam’book (you can get a free pdf file by request to mysirilokam@gmail.com) and also visit ‘Millet ZONE’ page on Facebook and read how to get rid of health problems:
Thyroid problems,
PCO d,
Obesity,
Recovering from Paralysis,
Constipation,
Autism,
improving memory power,
getting back control over stools after a decade of using ‘Anema’,
fighting Diabetes,
why white sugar is harmful to us,
why Palm Jaggery is better?
Why instant noodles are harmful to us, why table salt fails to help our health? Why refined flours & Oils are harmful to us? What are the chemicals hiding in our shampoos, soaps, processed foods, vegetables and Toothpaste? How to overcome such an onslaught of chemicals on us?
What are the problems with present day rice, wheat, Gluten, Glyphosate and Celiac disease?
How to get health while using Sir Dhanya as staple food, using decoctions, using cold pressed oils? And much more…..

www.mymilletzone.wixsite.com/siridhanya

SiriDhanya Millets for Total health !

Let us mitigate Life style diseases with Siri Dhanya !

For ORGANIC and UNPOLISHED Millets :

Visit www.mymilletzone.wixsite.com/siridhanya
and Facebook page ‘Millet ZONE’

Visit the OUTLET at Shaikpet, on Gachibowli main road at HS Darga circle. Ph 9492935095

or Visit OUTLET at Nallakunta, DD colony , Soma Sundar nagar ph nos. 040-27402344 , 9703844990 Hyderabad

write to mymilletzone@gmail.com

(Facebookwall)

మధుమేహం టైపు 2 -సిరి ధాన్యాలు -కషాయాలు : Reviewed by on . నేడు మీరిక మధు మేహానికి బానిసలు కానక్కర లేదు : ఆరోగ్యాన్ని కాపాడుకోండి ! What a relief ! నేడు భారత దేశం లో 7 నుండి 10 కోట్ల ప్రజలకు DIABETES-2 సోకింది. (కొందరు నేడు మీరిక మధు మేహానికి బానిసలు కానక్కర లేదు : ఆరోగ్యాన్ని కాపాడుకోండి ! What a relief ! నేడు భారత దేశం లో 7 నుండి 10 కోట్ల ప్రజలకు DIABETES-2 సోకింది. (కొందరు Rating: 0

Related Posts

scroll to top