Friday , 19 July 2019

Home » Slider News » భారతావని గర్వపడిన జాతి రత్నం…అబ్దుల్ కలాం

భారతావని గర్వపడిన జాతి రత్నం…అబ్దుల్ కలాం

July 27, 2015 5:56 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించే అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) సోమవారం రాత్రి 6:30 గంటలకు కన్నుమూశారు

let_us_sacrifice_our_today-646-163 copy
డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్, భారత దేశం గర్వపడిన జాతి రత్నం తమిళనాడు లోని రామేశ్వరంలో (అక్టోబర్ 15, 1931 – జులై 27, 2015) పుట్టి పెరిగారు. తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని మరియు తల్లి ఆశిఅమ్మ, గృహిణి. పేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు.
రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రం నందు పట్టా పొందారు.
1958లో మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఎం) నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT – చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDOలో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద INCOSPAR కమిటీలో పనిచేశారు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1963-64 లో, NASA యొక్క లాంగ్లే రీసెర్చ్ సెంటర్ ను(హాంప్టన్ వర్జీనియా లో కలదు) మరియు గ్రీన్బెల్ట్, మేరీల్యాండ్ లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు తూర్పు వర్జీనియా తీరంలో కల Wallops ఫ్లైట్ సౌకర్యం సందర్శించారు. 1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి.
970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. విజయవంతమైన SLV కార్యక్రమం టెక్నాలజీ ఉపయోగించి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంకోసం ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వలింట్ లకు కలం డైరెక్టర్ గా పనిచేశారు. కేంద్ర కేబినెట్ అసమ్మతి ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె విచక్షణ అధికారాలు ఉపయోగించి కలామ్ నిర్దేశకత్వంలోని అంతరిక్ష ప్రాజెక్టుల కోసం రహస్యంగా నిధులు కేటాయించారు.
కలాం పరిశోధన మరియు నాయకత్వంతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడంతో 1980లలో ప్రభుత్వం కలాం అధ్వర్యంలో ఆధునిక క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అప్పటి రక్షణ మంత్రి, ఆర్.వెంకటరామన్ సూచనతొ కలాం మరియు డాక్టర్ విఎస్ అరుణాచలం(రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు మరియు లోహశోధకుడు) తొ కలిసి ఒకేసారి పలు వివిధ క్షిపిని అబివృద్ధికి రూపకల్పన చేశారు. ఆర్ వెంకటరామన్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనే కార్యక్రమం కోసం 388 కోట్లు కేటాయించి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా కలాంను నియమించారు. కలాం, మధ్యంతర శ్రేణి ప్రాక్షేపిక క్షిపణి అగ్ని మరియు వ్యూహాత్మక ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పృధ్వి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు.
జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు. అబివృద్ది దశలో R చిదంబరం పాటు ప్రాజెక్ట్ సమన్వయకర్త గా పనిచేశారు. అణుపరిక్షల సమయంలో మీడియా తీసిన ఫొటోలతొ దేశంలోని అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త కలాం ప్రజలలో ప్రాముఖ్యం పొందారు.
1998 లో, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజు పాటు, కలిసి కలాం తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ కలాం-రాజు స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012 లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం -రాజు టాబ్లెట్ అనబడే టాబ్లెట్ PC రూపొందించారు.
భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్.జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు
కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. “ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు” అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదివారు.

భారతావని గర్వపడిన జాతి రత్నం…అబ్దుల్ కలాం Reviewed by on . మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించే అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) సోమవారం రాత్రి 6:30 గంటలకు కన్నుమూశారు డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అ మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించే అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) సోమవారం రాత్రి 6:30 గంటలకు కన్నుమూశారు డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అ Rating: 0

Related Posts

Leave a Comment

scroll to top