Tuesday , 12 December 2017

Home » Slider News » బతుకమ్మ చీరలతో మొదలైన లేని పంచాయితి

బతుకమ్మ చీరలతో మొదలైన లేని పంచాయితి

September 19, 2017 11:06 am by: Category: Slider News, తెలంగాణ Comments Off on బతుకమ్మ చీరలతో మొదలైన లేని పంచాయితి A+ / A-

jagtial sarees distributionతెలంగాణ రాష్ర్టంలో సర్కార్ పంచిన బతుకమ్మ చీరలతో లేని పంచాయితీలు మొదలయ్యాయి.  పంపిణి కేంద్రాల వద్ద కొన్ని చోట్ల  మహిళలు బారులు తీరి చీరల కోసం సిగపట్లు పట్టగా మరి కొన్ని చోట్ల తగల పెట్టారు. మొత్తానికి మొదటి రోజు చీరల పంపిణి రచ్చగా మారింది.  కాంగ్రేస్  నేతలు  కావాలనే చీరల పంపిణి రచ్చ  చేశారని ముఖ్యమంత్రి తనయుడు మంత్రి కెటిఆర్ మండిపడ్డాడు.

జగిత్యాలలోని ఓ ఊరిలో మహిళలు వెళ్తుంటే చీరలు గుంజుకుని తగలబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి నాయకులు దగ్గరుండి ఈ చీరలు కాల్చారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమంటే అక్షరాల ఇదే. లేని అపవాదును మీద వేయడానికి ఇలా కుసంస్కారమైన పనులతో తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారు..’’అని మంత్రి కెటిఆర్ విమర్శించారు.  ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది.. ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి అని ప్రశ్నించారు.

ఇష్టం లేక పోతే చీరలు తీసుకోవడం మానేయాలే తప్ప ఇట్లా తగల పెట్టడం సరికాదని ముఖ్యమంత్రి కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపి కవిత వ్యాఖ్యానించారు.

బతుకమ్మ చీరల పంపిణి విషయంలో  సర్కార్ తలిచిింది ఒక్కటి అయితే మరొకటి జరిగింది. గొడవల సంగతి పక్కన పెడితే చీరల నాణ్యత విషయంలో మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  నేతన్నలను ఆదుకునేందుకు నేత చీరలు అని చెప్పి సూరత్ నుండి తెప్పించిన  నాసి రకం ఫ్యాక్టరి చీరలు ఇచ్చారని మహిళలు అగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి కెటిఆర్ చెప్పినట్లు  ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలు ఏమో కాని బతుకమ్మ చీరలతో మహిళలు సర్కార్ తీరుపై దుమ్మెత్తి పోశారనేది వాస్తవం.

బతుకమ్మ చీరలతో మొదలైన లేని పంచాయితి Reviewed by on . తెలంగాణ రాష్ర్టంలో సర్కార్ పంచిన బతుకమ్మ చీరలతో లేని పంచాయితీలు మొదలయ్యాయి.  పంపిణి కేంద్రాల వద్ద కొన్ని చోట్ల  మహిళలు బారులు తీరి చీరల కోసం సిగపట్లు పట్టగా మరి తెలంగాణ రాష్ర్టంలో సర్కార్ పంచిన బతుకమ్మ చీరలతో లేని పంచాయితీలు మొదలయ్యాయి.  పంపిణి కేంద్రాల వద్ద కొన్ని చోట్ల  మహిళలు బారులు తీరి చీరల కోసం సిగపట్లు పట్టగా మరి Rating: 0

Related Posts

scroll to top