Sunday , 16 December 2018

Home » Slider News » బచావో నాగం….బచావో బచావో

బచావో నాగం….బచావో బచావో

April 1, 2016 1:56 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Leave a comment A+ / A-

Nagama Janardhan Reddy to be joined in trs
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఏదో ఒక విమర్శ చేసి దినాం వార్తల్లో నిలవాలని యత్నించే బాపతు మనుషుల్లో పాలమూరు జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి ఒకరు. మొదట తెలంగాణ లేదు గిలంగాణ లేదంటూ ఆ తర్వాత తెలంగాణ కోసం నగారా పార్టి పెట్టినా ఆదరణ లభించక పార్టీని చాపచుట్టి అటుకు ఎక్కించాడు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత బిజెపిలో చేరి అందులో కూడ ఆశించిన ఆదరణ లభించక పోవడంతో అసంతృప్తితో బయటికి వచ్చాడు. ఉమ్మడి రాష్ర్టంలో ఆంధ్ర పాలకుల దోపిడి ఈ నాయకుడికి కనిపించ లేదు. కాని తెలంగాణ రాష్ర్టంలో సాగు నీటి ప్రాజెక్టులలో అప్పుడే ఏదో అవినీతి మొదలైందంటూ తెలంగాణ బచావో మిషన్ అనే పేరుతో ఊరూరా తిరిగాడు. చివరికి కోర్టులో కేసు నిలవక పోవడంతో మరో సారి ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. సాగు నీటి ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందట. పోటి లేకుండా టెండర్లు మేనేజ్ చేసి ఆమోదించారని మొన్నటి వరకు 35 వేల కోట్లని చెప్పి ఇప్పుడు 60 వేల కోట్లు వ్యయం అవుతాయని చెబుతున్నారని నాగం ఆరోపించాడు. తన ఆరోపణలు పచ్చి నిజాలని నిరూపించక పోతే రాజకీయాల నుండి తప్పు కుంటానని పెద్ద సవాలే విసిరాడు. పాపం ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి ఏ రాజకీయాలలో ఉన్నారో ఆయనకే తెలియాలి. తెలంగాణ ఉద్యమం మొదలైనంక ఆంధ్ర రాజకీయాలలో మంత్రి పదవులతో ఓవెలుగు వెలిగిన వారంతా చాలా సంవత్సరాలు కెసిఆర్ ను ఆడి పోసుకుని ఆఖరికి ఢీలా పడి ఇక లాభం లేదని కెసిఆర్ పెట్టిన పార్టీలోనే చేరి పోయారు. చాలా మంది ఇప్పుడు మంత్రి పదవులుకూడ అనుభవిస్తున్నారు. పాపం నాగం జనార్దన్ రెడ్డికి మాత్రం రాజకీయాల్లో నోరు అచ్చి రాక ఆగమాగమవుతున్నడు. ఎవరైనా నాగం ను బచాయించి కోలుకునే టట్టు చేస్తే మేలు చేసిన వారవుతారు.

సిఎం కెసిఆర్ తెలంగాణ అభివృద్దికోసం చేస్తున్న పనులు చూసి ఓర్వలేకనే నాగం జనార్దన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టిఆర్ఎస్ పార్టి నేతలు విమర్శ.

ఆగమయ్యే నాగం ను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. ఎందరో మహానుభావులు తెలంగాణ వచ్చినంక కారెక్కి అధికారం అనుభవిస్తున్నారు. మరి నాగం ఎందుకు ఇట్లా అంటే ఆయనకు కెసిఆర్ అంటే గిట్టదట. తెలంగాణ రెడ్లను ఏకం చేసి కెసిఆర్ కు తానేంటో నిరూపించుకోవాలనేది నాగం పంత మట. అప్పటి దాకా ఆయన ఇంతే మరి.

బచావో నాగం….బచావో బచావో Reviewed by on . ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఏదో ఒక విమర్శ చేసి దినాం వార్తల్లో నిలవాలని యత్నించే బాపతు మనుషుల్లో పాలమూరు జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి ఒకరు. మొదట తె ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఏదో ఒక విమర్శ చేసి దినాం వార్తల్లో నిలవాలని యత్నించే బాపతు మనుషుల్లో పాలమూరు జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి ఒకరు. మొదట తె Rating: 0

Related Posts

scroll to top