Tuesday , 12 December 2017

Home » Slider News » పిచ్చి రాతలు – కూతలు ప్రజలు పట్టించు కోలేదు

పిచ్చి రాతలు – కూతలు ప్రజలు పట్టించు కోలేదు

kcr press meets
పిచ్చి రాతలు రాసిన ఆంధ్ర జ్యోతి దిన పత్రిక…..వాటిని పట్టుకుని పచ్చి కూతలు కూసిన ప్రతిపక్షాలను వరంగల్ ప్రజలు పట్టించు కోలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.వరంగల్ తీర్పు కని విని ఎరుగని చారిత్రాత్మక తీర్పని సిఎం కొనియాడారు. ప్రజల నమ్మకం వమ్ముచేయ బోమని మరిన్ని బరువు బాద్యలతో పనిచేస్తామని అన్నారు. ప్రభుత్వ పథకాలపై వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇవి బతిమాలుకుంటే లేదా డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చే ఓట్లు కావని అన్నారు.
వరంగల్ ప్రజలు ఉద్యమకాలంలోను ఇప్పుడూ టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని అన్నారు.ప్రతిపక్షాలకు వరంగల్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ఓ ఆంధ్రా జ్యోతిని పత్రిక పిచ్చిరాతలు రాస్తే తెలంగాణ నేతలు వాటిని పట్టుకుని ఊగులాడరని విమర్శించారు. తాను సీఎం అయిన ఐదో రోజునే తన దిష్టిబొమ్మను దహనం చేయించి ఆంధ్రా పత్రిక దాష్టీకానికి పాల్పడి నీచ సంస్కృతిని ఏర్పరిచిందన్నారు. సీఎం అయిన ఐదో రోజే దిష్టిబొమ్మను దహనం చేసిన చరిత్ర దేశ రాజకీయాల్లోనే లేదని వివరించారు. ఇదే పంతాను మన రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు కొనసాగించాయని కెసిఆర్ మండిపడ్డారు.
రాష్ర్టంలో
రాష్ర్టంలో 231 కరవు మండలాలు
రాష్ర్టంలో 231 మండలాలలో కరవు పరిస్థితులు నెల కొన్నాయని ఆదుకునేందుకు రూ 1000 కోట్లనిదులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్రానికి నివేదిక పంపామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాపాతం బాగానే ఉందని తెలిపారు. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని అట్లాగే కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షికంగా కరువు నిర్దారించారని వివరించారు.

పిచ్చి రాతలు – కూతలు ప్రజలు పట్టించు కోలేదు Reviewed by on . పిచ్చి రాతలు రాసిన ఆంధ్ర జ్యోతి దిన పత్రిక.....వాటిని పట్టుకుని పచ్చి కూతలు కూసిన ప్రతిపక్షాలను వరంగల్ ప్రజలు పట్టించు కోలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికల ఫలి పిచ్చి రాతలు రాసిన ఆంధ్ర జ్యోతి దిన పత్రిక.....వాటిని పట్టుకుని పచ్చి కూతలు కూసిన ప్రతిపక్షాలను వరంగల్ ప్రజలు పట్టించు కోలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికల ఫలి Rating: 0

Related Posts

scroll to top