Monday , 20 May 2019

Home » Slider News » పంచాయితి నగారా మోగింది…జనవరి 21,25,30 ఎన్నికలు

పంచాయితి నగారా మోగింది…జనవరి 21,25,30 ఎన్నికలు

January 1, 2019 6:50 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on పంచాయితి నగారా మోగింది…జనవరి 21,25,30 ఎన్నికలు A+ / A-

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, చివరగా జనవరి 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు చెప్పారు. నవంబర్‌ 11లోగా ఓటు నమోదు చేసుకున్నవారందరూ ఓటు వేసేందుకు అర్హులని ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా కోటి 49 లక్షల 52వేల 58 మంది ఓటర్లున్నట్టు ఆయన తెలిపారు. మరోపక్క జనవరి 7 నుంచి 21 వరకు తొలివిడత ఎన్నికల ప్రక్రియ, జనవరి 11 నుంచి 25 వరకు రెండో విడత, జనవరి 16 నుంచి 30 వరకు మూడో విడత ఎన్నికల ప్రక్రియ జరగనున్నట్టు నాగిరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. మొత్తం 12,732 గ్రామ పంచాయతీల్లోని 1,13,170 వార్డు సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలకు, రెండో విడత, మూడో విడతల్లో వరుసగా 4,137, 4,115 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.

పంచాయితి నగారా మోగింది…జనవరి 21,25,30 ఎన్నికలు Reviewed by on . హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించను హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించను Rating: 0
scroll to top