Thursday , 19 October 2017

Home » Slider News » నోట్లరద్దు సక్సెస్‌కు ఆధారమేదీ?

నోట్లరద్దు సక్సెస్‌కు ఆధారమేదీ?

August 22, 2017 11:17 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on నోట్లరద్దు సక్సెస్‌కు ఆధారమేదీ? A+ / A-

Currency ban and modi న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత ప్రధాన లక్ష్యంగా తీసుకున్న పెద్ద నోట్లరద్దు నిర్ణయం విజయవంతమైందని పంద్రాగస్టు నాడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్యాంకులకు ఇప్పటివరకూ చేరని రూ.3 లక్షల కోట్లు నోట్లరద్దు తర్వాత డిపాజిట్‌ ఆయ్యాయని వెల్లడించారు. అయితే వీటిలో రూ.1.75 లక్షల కోట్లు నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో జమ కాగా.. రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని గడిచిన మూడేండ్ల కాలంలో వెలికి తెచ్చినట్టు వివరించారు. 18 లక్షల మంది ప్రజలు ఆదాయానికి మించి ఆస్తులను కల్గి ఉన్నట్టు తేలిందన్నారు. ప్రభుత్వ గణాంకాలను ఆధారంగా చేసుకొని మోడీ ఈలెక్కలు చెప్పారను కుంటే పొరపడినట్టే. ఎందుకంటే.. గతేడాది నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్పటి నుంచి ఇప్పటివరకు బ్యాంకుల్లో ఎంత డబ్బు జమైందన్నది వెల్లడించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిరాకరిస్తున్నది. ఎంత నల్ల ధనం వెలికి వచ్చిందన్నది అటు ఆర్బీఐగానీ, ఇటు కేంద్ర ఆర్థి క మంత్రిత్వశాఖగానీ ఇప్పటికీ అంచనా వేయలేదు. చెలామణిలో ఉన్న 86శాతం కరెన్సీని ఆకస్మికంగా రద్దు చేస్తూ తీసుకు న్న నిర్ణయం దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నది వాస్తవం. ఈ విషయాన్ని పలు సర్వేలు బట్టబయలు చేశాయి.

నోట్లరద్దు సక్సెస్‌కు ఆధారమేదీ? Reviewed by on .  న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత ప్రధాన లక్ష్యంగా తీసుకున్న పెద్ద నోట్లరద్దు నిర్ణయం విజయవంతమైందని పంద్రాగస్టు నాడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్యాంకులకు ఇప్పట  న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత ప్రధాన లక్ష్యంగా తీసుకున్న పెద్ద నోట్లరద్దు నిర్ణయం విజయవంతమైందని పంద్రాగస్టు నాడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్యాంకులకు ఇప్పట Rating: 0
scroll to top