ప్రకృతి ఇచ్చిన వరాల్లో ఒకటి నిమ్మ.రోగాల భారిన పడి మంచం పట్టకముందే నిమ్మ కాయరసాన్ని రోజూ పద్దతి ప్రకారం తీసుకుంటే బాడి ఇమ్యునిటి పెరిగి రోగాలు దరి చేరవు. నిమ్మకాయ రసాన్ని ఎట్లా వాడాలనేది తెల్సుకోవాలి..
• రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
• నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
• కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
• ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం.
• శరీరం నీరసించినపుడు సెలైన్కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది
• మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.
• వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది.
• వడదెబ్బ నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
• గజ నిమ్మరసాన్ని (ఒక కాయ) 20 గ్రా. కొబ్బరినూనెలో పిండి, తలకూ, ముఖానికి, శరీరానికి రాసుకుని, ఎండలో 15 ని, ఉండి తర్వాత స్నానం చేస్తే, అనేక చర్మ వ్యాధులు నివారితమౌతాయి. నిమ్మకాయను క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వారానికి ఒకమారు నిమ్మనూనె రుద్దుకుంటే చర్మానికి ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చలు గలవారు ఈ నూనెను 40 రోజుల వరకు రుద్దుకుంటే, ఫలితం కనబడుతుంది.
• నిమ్మరసాన్ని ఎలా తయారు చేసు కోవాలి ?
• నిమ్మరసం అంటే చక్కని చిక్కని రసం కాదు. ఆ రసం చాలా తీక్షణత గల్గి ఉంటుంది. బండమీద పడితే, బండ తెల్లగా పొంగటం అందరికీ తెలుసు. అలాంటి నిమ్మరసం నేరుగా స్వీకరిస్తే, మృదువైన జీర్ణాశయం రంధ్రాలు పడి, చెడిపోతుంది. కాబట్టి నిమ్మరసాన్ని అలాగే పుచ్చుకోకూడదు. ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ కోయాలి. కాయ పెద్దదయితే ఒక ముక్కను ఆ గ్లాసు నీటిలో పిండాలి. కాయ చిన్నగా ఉంటే రెండు ముక్కలను పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసం తయారవుతుంది. ఈ నిమ్మరసానికి రెండు చెంచాల స్వచ్చమైన తేనెను కలిపితే బాగుంటుంది. తేనె లేకపోతే, కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. లేదా ఏమీ వేసుకోకుండా అలాగే త్రాగవచ్చు. ఇలా తయారు చేసిన నిమ్మరసాన్ని రోగికి ఉందయం 7 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అవసరమైతే రాత్రి పడుకునే ముందు ఇవ్వాలి.
Latest News
- » 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీసీల తక్షణ కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత
- » 10 శాతం ఇబిసి రిజర్వేషన్ల బిల్లు భవిష్యత్ ఏమిటి?
- » సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు
- » ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు భారీ మెజార్టీతో లోక్ సభ ఆమోదం
- » ఓబిసి రిజర్వేషన్లను విభేదించిన అసదుద్దీన్ ఒవైసీ
- » మంత్రి వర్గం కొలువు దీరేదెన్నడో…..అంతా గప్ చుప్
- » ‘హమారే కో తెలంగాణ మే మిలాలేవో’
- » కలెక్టర్ ఔదార్యానికి ప్రశంసలు
- » మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలించిన కెసిఆర్
- » పంచాయితి నగారా మోగింది…జనవరి 21,25,30 ఎన్నికలు