Monday , 20 May 2019

Home » Slider News » నకిలి సర్టిఫికేట్ల ముఠాను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

నకిలి సర్టిఫికేట్ల ముఠాను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

July 20, 2018 8:03 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on నకిలి సర్టిఫికేట్ల ముఠాను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు A+ / A-

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల అంతర్‌ రాష్ట్ర ముఠాను  వరంగల్ సి.సి.ఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు.

warangal policeసింహద్రి మనోజ్‌,కోండి శేట్టి నాగభూషణం,సంసాద బాపురాజు ఆలియాస్‌ బాపిరాజు,గడ్డల నాగ రాజు, రాబిల్లి సూర్యనారయణ, . పెండ్యాల సత్యనారయణ ఆలియాస్‌ రమేష్‌, నిట్టూరి వెంకటేశ్‌ ల నుండి పోలీసులు నకిలిసర్టఫికేట్లు కలర్ ప్రింటర్లు స్వాదీనం చేస్కున్నారు.

40మందికి సంబంధించిన ఆంధ్ర యూనివర్సీటీతో పాటు దేశంలో పలు యూనివర్సీటీలకు సంబంధించిన ఇంజనీరింగ్‌, పీ.జీ, డిగ్రీ, ఇంటర్మీడియట్‌ ,డిప్లోమోలకు చెందిన 131 నకిలీ సర్టిఫికేట్లు, 25 అంధ్రయూనివర్సీటీ సంబంధిన పేర్లు పూరించని సర్టిఫికేట్లు, సర్టిఫికేట్ల తయారికి వినియోగించే 2 ల్యాప్‌టాప్‌లు, 3 కలర్‌ ప్రింటర్లు, ఒక ట్యాబ్‌, ఒక ఐ ప్యాడ్‌, 11 సెల్‌ఫోన్లు, పదివేలరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

ప్రధాన నిందితుడు సింహద్రి మనోజ్‌ పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో 2013 సంవత్సరంలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, 2015 సంవత్సరంలో స్వంతంగా ఒకేషనల్‌ మరియు డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసాడు. నిందితుడు మనోజ్‌కు కాలేజీ నిర్వహణ ఖర్చులతో పాటు అధికంగా జల్సాలు చేయడంతో అధిక మొత్తంలో డబ్బులు ఖర్చుకావడంతో అప్పులు కావడంతో పాటు మనోజ్‌  విశాఖపట్నంలో మరో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందులో  భాగంగా నిందితుడు మనోజ్‌ డిగ్రీ కాలేజీ అనుమతుల కోరకు గాను విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిధ్యాలయములకు తరుచుగా వేళ్ళి వచ్చేవాడు. ఇదే క్రమములో మనోజ్‌కు ఇదే విశ్వవిద్యాలయములో కర్ల్క్‌గా పనిచేస్తున్న మరో నిందితుడు కోండిశెట్టి నాగభూషణం, రికార్డు అసిస్టెంట్‌ బాపురాజు ఆలియాస్‌ బాపిరాజులతో పరిచయం ఏర్పడింది.

 

ఈ నిందితులు ముగ్గురి మధ్య స్నేహం కుదరటంతో ఈ ముగ్గురు నిందితుల కల్సి జల్సాలు చేసేవారు. ఈ ముగ్గురు నిందితుల్లో ఒకడైన కోండిశెట్టి నాగభూషణం, బాపురాజు 2005 సంవత్సరంలో నకిలీ సర్టిఫికేట్లు విక్రయించిన నేరంపై విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించనట్లుగా మనోజ్‌  తెలుసుకోని, వారితో కల్సి నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించి తన అవసరాలను తీర్చుకోవచ్చనే ఆలోచనతో, నిందితుడు సింహద్రి మనోజ్‌ నాగభూషణం, బాపిరాజుతో

 

పాటు మరో నలుగురు నిందితులైన గడ్డల నాగ రాజు,రాబిల్లి సూర్యనారయణ, పెండ్యాల సత్యనారయణ ఆలియాస్‌ రమేష్‌, నిట్టూరి వెంకటేశ్‌ లతో ఓ ముఠాగా ఏర్పడిన ఈ ఏడుగురు నిందితులు ఆంధ్ర యూనివర్సీటీతో పాటు దేశంలోని పేరున్న యూనివర్సీటీలకు సంబంధించిన ఇంజనీరింగ్‌, పీజీ, డిగ్రీ, డిప్లోమోతో పాటు ఇంటర్మీడియట్‌ నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటిని ఒక్కోక్కటి 75వేల రూపాయలకు విక్రయించేందుకు ఈ ముఠా ప్రణాళికలను రూపోందించుకున్నారు.

 

ఇందులో భాగంగానే ఈ ముఠా సభ్యులు గత ఆరు నెలల వ్యవధిలో ఆంధ్ర యూనివర్సీటీ, కాకినాడ జె.ఎన్‌.టి.యూ పాటు, తమిళనాడు రాష్ట్రంకు చెందిన తిరువల్లూవార్‌ విశ్వవిధ్యాలయము, కాన్పూర్‌కు చెందిన ఛత్రపతి సాహుజీ మహరాజ్‌ విశ్వవిధ్యాలయము, బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యూకేషన్‌లకు సంబంధించి ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సుమారు వంద మంది భాధితులకు 75వేల రూపాయల చోప్పున అసలు సర్టిఫికేట్లుగా నమ్మించి ఇంజనీరింగ్‌, పీజీ, డిగ్రీ, డిప్లోమోతో పాటు ఇంటర్మీడియట్‌ నకిలీ సర్టిఫికేట్లను ముద్రించి వాటిని   విక్రయించి సుమారు 75లక్షలను ఈ ముఠా సభ్యులు సంపాదించి జల్సాలు చేసారు.

 

ఈ ముఠా సభ్యులు నిందితుల్లో ఒకడైన నిట్టూరి వెంకటేశ్‌ సహకారంతో కరీంనగర్‌ జిల్లాకు చెందిన గాజుల రవితేజతో  30వేల రూపాయలకు నిజమయిన పాలిటెక్నిక్‌ డిప్లోమో సర్టిఫికేట్‌ ఇప్పిస్తామని నమ్మించి సదరు బాధితుడికి ఈ ముఠా నకిలీ పాలిటెక్నిక్‌ డిప్లోమో సర్టిఫికేట్‌ అందజేసారు. మరో సంఘటలో వరంగల్‌ జిల్లాకు చెందినసుదమళ్ళ ప్రశాంత్‌కు 75 వేల రూపాయలకు నిజమయిన ఇంజనీరింగ్‌ పాస్‌ సర్టిఫికేట్‌ ఇప్పిస్తామని నకిలీ సర్టిఫికెట్‌ను అందజేసారు. ఇదే తరహలో ఈ మూఠా సభ్యులు జగిత్యాల జిల్లాలో పనిచేసే వాకమూడిల సూరపునాయుడుకు 30 వేల రూపాయలకు నిజమయిన ఇంజనీరింగ్‌ పాస్‌ సర్టిఫికేట్‌ ఇప్పిస్తామని నకిలీ సర్టిఫికెట్‌ను అందజేసారు. ఈ మూడు సంఘటనల్లో సర్టిఫికేట్లు పోందిన ముగ్గురు బాధితులకు  ్ల తమకు  అందజేసిన సర్టిఫికేటు నకిలీవిగా గుర్తించి మోసపోయిన ముగ్గురు బాధితులు మట్వాడా, హన్మకోండ, కరీంనగర్‌ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో ఈ ముఠాపై పిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసారు.

ఈ ముఠాను పట్టుకోనేందుకు గాను వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ అదేశాల మేరకు సి.సి.ఎస్‌ పోలీస్‌ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి నిందితులపై నిఘా పెట్టడం జరిగింది.

దర్యాప్తులో భాగంగా మంచిర్యాలకు చెందిన నిట్టూరి వెంకటేశ్‌ ద్వారా ఈముఠా సభ్యులు వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాలకు చెందిన మరో 40మందికి నకిలీ సర్టిఫికేట్లను అందజేసేందుకుగాను ముద్రణ పరికరాలు నకిలీ సర్టిఫికేట్లతో వరంగల్‌ నగరంలోని సాయిగణేష్‌ లాడ్జ్‌లో మకాం వేసివున్నట్లుగా క్రైమ్స్‌ అదనపు డి.సి.పి బి. అశోక్‌కుమార్‌కు ఖచ్చితమైన సమాచారం రావడంతో అదనపు డి.సి.పి అదేశాల మేరకు సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు పి.డేవిడ్‌రాజు, డి.రవిరాజులు సి.సి.ఏస్‌ మరియు మట్వాడా పోలీసు సిబ్బందితో వెళ్ళి ఈ ముఠా సభ్యులను అదుపులోని కి తీసుకున్నారు.

నకిలీ సర్టిపికేట్ల పేరుతో కోటి రూపాయల ఘరాన మోసానికి పాల్పడిన మూఠా సభ్యులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు డి.సి.పి బి. అశోక్‌కుమార్‌, క్రైం ఏ.సి.పి బి.బాబురావు, సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు పి.డేవిడ్‌రాజు, డి.రవిరాజు,ఎస్‌.ఐలు వెంకటప్పయ్య, సుబ్రమణ్యం, హెడ్‌ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్‌ రాజు, రవికుమార్‌, జంపయ్య కానిస్టేబుళ్ళు మహమ్మద్‌ ఆలీ (మున్నా) లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి. రవీందర్‌ అభినందించారు.

నకిలి సర్టిఫికేట్ల ముఠాను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు Reviewed by on . తెలుగు రాష్ట్రాల్లో నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల అంతర్‌ రాష్ట్ర ముఠాను  వరంగల్ సి.సి.ఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. సింహద్రి మనోజ తెలుగు రాష్ట్రాల్లో నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల అంతర్‌ రాష్ట్ర ముఠాను  వరంగల్ సి.సి.ఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. సింహద్రి మనోజ Rating: 0
scroll to top