Saturday , 24 August 2019

Home » ఫోర్త్ పాయింట్ » నాకో డీ అడిక్షన్ సెంటరు గావాలే..రమేశ్ హజారి

నాకో డీ అడిక్షన్ సెంటరు గావాలే..రమేశ్ హజారి

INDIAN FARMER NEED DE ADICTION CAMP
నాకో డీ అడిక్షన్ సెంటరు గావాలే
— హజారి

యిత్తుకూ యిత్త నానికీ
తన్నుకొచ్చేమొల్కకు
దాన్నిదాసుకున్న చెల్కకు
పచ్చపచ్చని పంటకు పైరగాలికి
బానిసను

నా కష్టం పంచుకునే
పసురానికి
రక్తం గుంజుకునే
పలుగు పారకు
పుట్టుబానిసను

నేను బానిసనూ
వ్యసనపరున్నీ

నకిలీ విత్తనాలకు
మకిలీ ఎరువులకు
బోరు బావులకు
కాలే కరెంటు మోటర్లకు
కౌలు భూములకు
కల్తీ పురుగు మందులకు
బానిసను

చక్ర వడ్డీలకు
వరుస అప్పులకు
సలిపే కరువు నొప్పులకు
బానిసను

కర్రు నాగలికి
కరెంటు స్టాటరుకు
సుర్రుమనేే యెండకు
ముసురుకున్న చీకటికి
ముంచిపోయే చలికి
యిసిరికొట్టే తుఫానుకు
తన్నుకొచ్చే వనుకుడుకు
నేను బానిసను

నీనిప్పుడో నయా బానిసను

ఆధునిక బానిస విలువలను గాలికి వదిలి
యవసాయం అనే
యెండిన మోదుగు కొమ్మకు
యేలాడుతున్న జవాబు దొరకని
పట్టు వదలని బేతాళున్ని

జవాబు లేని
యెన్నటికీ రాని
యే పాలక పక్సం విప్పలేని మరే ప్రతిపక్శమూ బిగించలేని
యే విక్రమార్కునికీ అందని సమాదానం లేని ప్రశ్నను

కార్పోరేట్ విషపు ప్రయోగశాలలో మండెకట్టబడిన ప్రశ్నల కొడువలని

నీనిప్పుడు వ్యవసాయానికి వో నయా వ్యసనపరున్ని
నా వ్యవసాయ వ్యసనానికి విముక్తి గావాలే

నాకిప్పుడో డీ అడిక్షన్ సెంటర్ గావాలె
అది కేవలం
మానవత్వం నిండిన మట్టి వాసన తెలిసిన పచ్చని ఆకు పచ్చని మనుషులుండే డీ అడిక్షన్ సెంటర్ గావాలె
దోస్త్ జరా పతా జెప్పవా

నాకో డీ అడిక్షన్ సెంటరు గావాలే..రమేశ్ హజారి Reviewed by on . నాకో డీ అడిక్షన్ సెంటరు గావాలే -- హజారి యిత్తుకూ యిత్త నానికీ తన్నుకొచ్చేమొల్కకు దాన్నిదాసుకున్న చెల్కకు పచ్చపచ్చని పంటకు పైరగాలికి బానిసను నా కష్టం పంచుకునే పస నాకో డీ అడిక్షన్ సెంటరు గావాలే -- హజారి యిత్తుకూ యిత్త నానికీ తన్నుకొచ్చేమొల్కకు దాన్నిదాసుకున్న చెల్కకు పచ్చపచ్చని పంటకు పైరగాలికి బానిసను నా కష్టం పంచుకునే పస Rating: 0

Related Posts

scroll to top