Thursday , 19 October 2017

Home » Slider News » దంగల్ 2 వేల కోట్లు దాటేసింది

దంగల్ 2 వేల కోట్లు దాటేసింది

June 29, 2017 8:07 pm by: Category: Slider News, సినిమా Comments Off on దంగల్ 2 వేల కోట్లు దాటేసింది A+ / A-

dangal crossed rs 2000 croreముంబై: ఆమిర్‌ఖాన్ సినిమా ‘దంగల్’ అదరగొట్టే రికార్డు సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2000 కోట్ల వ‌సూళ్ల సాధించిన తొలి భారతీయ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. తాజాగా ఈ విష‌యాన్ని ఫోర్బ్స్ మ్యాగ‌జీన్ ధ్రువీక‌రించింది. చైనాలో ఈ సినిమా విడుదలైన 53వ రోజు.. రూ.2.5 కోట్లు వసూలు చేసి, ఈ అరుదైన మార్క్‌ను అందుకున్న‌ట్లు ఆ పత్రిక వెల్ల‌డించింది. రెజ్ల‌ర్.. మ‌హావీర్ సింగ్ ఫోగాట్ జీవిత‌ చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఒక్క చైనాలోనే రూ. 1200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం గమనార్హం. ఇండియాలో వచ్చిన వసూళ్ల కంటే దాదాపు రెట్టింపు వ‌సూళ్లను చైనాలోనే సొంతం చేసుకోవడం విశేషం. దీన్ని బట్టి ఆమిర్‌ఖాన్‌కు చైనాలో ఉన్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమా కూడా చైనాలో బాగా ఆడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా చైనాలో ఆమిర్‌కే సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు.

హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్.. కెప్టెన్ అమెరికా, ట్రిపుల్ ఎక్స్‌, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌, టైటానిక్ 3డీ, ద జంగిల్ బుక్‌, కుంగ్ ఫు పాండా 3 లాంటి సినిమాల క‌ంటే అధికంగా వ‌సూళ్లు రాబట్టిన చిత్రంగా దంగ‌ల్ నిలవడం మరో విశేషం. కలెక్షన్ల సునామీతో దూసుకొస్తున్న మరో సినిమా ‘బాహుబలి-2’ ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో తెలియాలంటే వేచి చూడాలి..

దంగల్ 2 వేల కోట్లు దాటేసింది Reviewed by on . ముంబై: ఆమిర్‌ఖాన్ సినిమా ‘దంగల్’ అదరగొట్టే రికార్డు సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2000 కోట్ల వ‌సూళ్ల సాధించిన తొలి భారతీయ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. తా ముంబై: ఆమిర్‌ఖాన్ సినిమా ‘దంగల్’ అదరగొట్టే రికార్డు సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2000 కోట్ల వ‌సూళ్ల సాధించిన తొలి భారతీయ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. తా Rating: 0

Related Posts

scroll to top