Wednesday , 22 August 2018

Home » Slider News » సర్కార్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

సర్కార్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

July 18, 2018 9:03 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on సర్కార్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు A+ / A-

bjp leaders it police stationశ్రీ పరిపూర్ణానంద స్వామి పై వేసిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొరటానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ శాసనసభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ గారిని మరియు బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత అంబర్ పేట శాసనసభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని, శాసనమండలి పక్ష నేత ఎం.ఎల్.సి శ్రీ ఎన్ రామచందర్ రావు గారిని, మరియు ఇతర బీజేపీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారిని, NVSS ప్రభాకర్ గారిని, రాజా సింగ్ గారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాని నిరసిస్తూ బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా నాయకులు ఈరోజు హన్మకొండ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల్ల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు అమరేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిజాం పాలన నడుస్తుందని, కెసిఆర్ ఒక నియంతల తనకి తోచింది చేస్తు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఈరోజు శాంతియుతంగా తనని కలిసి మాట్లాడి శ్రీ పరిపూర్ణానంద స్వామి పై వేసిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని కొరటానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ శాసనసభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ గారిని మరియు బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత అంబర్ పేట శాసనసభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని, శాసనమండలి పక్ష నేత ఎం.ఎల్.సి శ్రీ ఎన్ రామచందర్ రావు గారిని, మరియు ఇతర బీజేపీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారిని, NVSS ప్రభాకర్ గారిని, రాజా సింగ్ గారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కుని చేయడమని విమర్శించారు. ఎంఐఎం నాయకుల మోచేతి నీళ్లు త్రాగుతు మెజారిటీ హిందూల మనోభావనలను దెబ్బతీస్తున్నారని దానికి రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం తెలియజేస్తారని హెచ్చరించారు. అనంతరం పోలీసులు దాదాపు 40 మంది బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి హన్మకొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు. తదనంతరం వారిని సొంత పూచీకత్తు పై విడుదల చేశారు. ఈయొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాండ్రతి యాదగిరి, వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గురుమూర్తి శివకుమార్, కొలను సంతోష్ రెడ్డి, సంగని జగదీశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు మాందాటి వినోద్, బాకం హరిశంకర్, చిర్ర నర్సింగ్ గౌడ్, జిల్లా కార్యదర్శులు జన్ను మధు,చీర్ల స్నేహలత రెడ్డి, వరంగల్ పార్లమెంట్ కన్వినర్ తాళ్లపల్లి కుమార్ స్వామి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వినర్ పాశికంటి రాజేంద్రప్రసాద్, వరంగల్ తూర్పు నియోజకవర్గ కన్వినర్ మండల సురేష్, వరంగల్ అర్బన్ జిల్లా యువమోర్చ, కిసాన్ మోర్చా, మైనారిటీ మోర్చా అధ్యక్షులు గుండమీది శ్రీనివాస్, పుల్యాల రవీందర్ రెడ్డి, చాంద్ పాషా, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వినర్ కందగట్ల సత్యనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాని నాయక్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట సత్యం, యువమోర్చ రాష్ట్ర నాయకులు వంశీచంద్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా నాయకులు నాంపల్లి శ్రీనివాస్, నాగపురి వెంకటేష్ గౌడ్, వివిధ డివిజన్ల అధ్యక్షులు సోమయ్య, పెరుగు సురేష్, వెంకట్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సర్కార్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు Reviewed by on . శ్రీ పరిపూర్ణానంద స్వామి పై వేసిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొరటానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ శా శ్రీ పరిపూర్ణానంద స్వామి పై వేసిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొరటానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ శా Rating: 0
scroll to top