Sunday , 16 December 2018

Home » Slider News » తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ.. 19 వరకు నామినేషన్ల గడువు

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ.. 19 వరకు నామినేషన్ల గడువు

November 12, 2018 11:40 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ.. 19 వరకు నామినేషన్ల గడువు A+ / A-

Electionsహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం (నవంబరు 12) వెలువడింది.  రాష్ర్టంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం  ఈ రోజు నుండి  (12 నవంబర్) అభ్యర్ధులు నవంబరు 19 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. నవంబరు 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు
ఉంది. డిసెంబర్‌ 7న పోలింగ్‌, 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూలు..

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇదివరకే ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు ఆదివారం (నవంబరు 11) బి-ఫారాలను కూడా
అందజేసింది. మరోవైపు ‘మహాకూటమి’ సీట్ల పంపకం ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. సోమవారం సాయంత్రానికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ పత్రాల సమర్పణ, నిబంధనల వివరాలు..
* ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు రూ.10 వేలు నామినేషన్ రుసుంను చెల్లించాలి.

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ.. 19 వరకు నామినేషన్ల గడువు Reviewed by on . హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం (నవంబరు 12) వెలువడింది.  రాష్ర్టంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం (నవంబరు 12) వెలువడింది.  రాష్ర్టంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట Rating: 0
scroll to top