Saturday , 25 November 2017

Home » Slider News » తమిళులు- తెలుగు వారి మద్య విభేదాలు ప్రేరేపిస్తున్న రాధిక

తమిళులు- తెలుగు వారి మద్య విభేదాలు ప్రేరేపిస్తున్న రాధిక

January 20, 2017 6:31 am by: Category: Slider News, సినిమా Leave a comment A+ / A-

సినిమా రంగంలో ఉన్న వ్యక్తుల హావభావాలు తెరమీద చూసితెగ సంబర పడి పోతుంటాం. వారి నిజ స్వరూపానికి వెండి స్వరూపానికి చాలా తేడా ఉంటుందని పలు మార్లు రుజువు చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన రాధిక తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాలతో ఫేమ్ అయ్యారు. కాని తెలుగు వారిపై విషం కక్కుతున్నారు. తెలుగు వారే కాదు రాష్ర్టేతరులపై మండి పడుతున్నారు. తమిళనాడులో స్థానికేతరులే రాజ్యమేలుతున్నారని, వీళ్లను ఆదరించాల్సిన అవసరం తమిళులకేంటని వారికి అడ్డు కట్టుల వేయాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారు. ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, వైగో, విజయ్ కాంత్ తదితరులంతా స్థానికేతరులేనని విమర్షించిన రాధిక. వీళ్లను ఆదరించాల్సిన అవసరం లేదని అన్నారు. అంతటితో ఆగకుండా “విశాల్ రెడ్డి ఎవరు? రెడ్డి కులస్తుడు ఆంధ్రా నుంచి వచ్చాడు..విశాల్ రెడ్డే కాదు..కార్తీ, శివరామ్ వీళ్లంతా ఎవరు? తమిళులా? అంటూ మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు రాధికకు కోపం ఎందుకు వచ్చిందటే రాజకీయాల్లో ఉన్న భర్త శరత్ కుమార్ కొద్ది రోజుల క్రితం రజనికాంత్ పై ఘాటు విమర్శలు చేశాడు. దాంతో రజని ఫాన్స్ ఊరుకుంటారా శరత్ కుమార్ దిష్టి బొమ్మలు దగ్దం చేసారు. భర్తను సమర్దిస్తూ రాధిక మీడియా ముందుకు వచ్చి సివమెత్తారు. రాధిక విమర్శల వెనక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. తమిళనాడులో జయలలిత మరణాంతరం రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి.తమిళుల సెంటిమెంట్ రెచ్చగొట్టి రాధిక ఆమె భర్త రాజకీయాల్లో పాతుకు పోవాలని చూస్తున్నారని రజిని అభిమానులు విమర్శిస్తున్నారు.

 

తమిళులు- తెలుగు వారి మద్య విభేదాలు ప్రేరేపిస్తున్న రాధిక Reviewed by on . సినిమా రంగంలో ఉన్న వ్యక్తుల హావభావాలు తెరమీద చూసితెగ సంబర పడి పోతుంటాం. వారి నిజ స్వరూపానికి వెండి స్వరూపానికి చాలా తేడా ఉంటుందని పలు మార్లు రుజువు చేసుకున్నారు సినిమా రంగంలో ఉన్న వ్యక్తుల హావభావాలు తెరమీద చూసితెగ సంబర పడి పోతుంటాం. వారి నిజ స్వరూపానికి వెండి స్వరూపానికి చాలా తేడా ఉంటుందని పలు మార్లు రుజువు చేసుకున్నారు Rating: 0

Related Posts

scroll to top