Friday , 22 March 2019

Home » Slider News » తండ్రి ఆజ్ఞను శిరసా వహించి హైదరాబాద్ లో నెలరోజులు ఓ కోటీశ్వరుడు

తండ్రి ఆజ్ఞను శిరసా వహించి హైదరాబాద్ లో నెలరోజులు ఓ కోటీశ్వరుడు

August 12, 2017 4:20 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on తండ్రి ఆజ్ఞను శిరసా వహించి హైదరాబాద్ లో నెలరోజులు ఓ కోటీశ్వరుడు A+ / A-

Hitarth A billionaire sonహైదరాబాద్: తండ్రి  ఆజ్ఞను శిరసా వహించి ఓ కోటీశ్వరుడి కుమారుడు హైదరాబాద్ లో నెల రోజుల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు అది కూడ ఉదర పోషణ కోసం  దిన సరి కూలీపనులు  చేశాడు. ఇదేదో వెనుకటి పిట్టకథలెక్క ఉన్నా ఇది నిజం. తెలంగాణ  హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది సాక్షిగా ఈ యధార్థ గాధ వెలుగులోకి వచ్చింది.

గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒకరు ఘన్‌శ్యామ్ డోలాకియా. ఈయనే హరేకృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్స్ యజమాని. ఈయన కుమారుడు… హితార్థ్. దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే అధిపతి. వేల కోట్లకు అధిపతికావాలంటే తండ్రి ఓ కాల పరీక్ష పెట్టాడు. అదే నెల రోజుల అజ్ఞాతవాసం. అంతే.. తండ్రి ఆదేశాన్ని తూ.చా. తప్పకుండా పాటించాడు హితార్థ్.
తండ్రి కొనిచ్చిన ఫ్లైట్ టికెట్‌ను జేబులో పెట్టుకుని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అక్కడ టిక్కెట్ చూసిన తర్వాతే తాను హైదరాబాద్‌కు వెళుతున్నట్టు హితార్థ్ తెలుసుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత బస్సులో సికింద్రాబాద్ చేరుకున్నాడు. తొలిరోజు రూ.100కు ఒక హోటల్‌లో మంచాన్ని అద్దెకు తీసుకుని ఒక్కరాత్రి ఉన్నాడు. తాను ఉద్యోగం కోసం వచ్చానని, రైతు కుటుంబీకుడినని చెప్పాడు. ఉద్యోగాలు లభించే ప్రాంతాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో సలహాను ఇవ్వగా, ఓ బస్సు కండక్టర్ సూచన మేరకు అమీర్‌పేట వెళ్లి ప్రయత్నించాడు.
ఆ తర్వాత హైటెక్ సిటీకి వెళ్లి పలు కంపెనీల్లో పని చేశాడు. ఆపై సికింద్రాబాద్‌లోని వైట్ బోర్డు తయారీ సంస్థలో కుదురుకున్నాడు. కొన్ని రోజులు రిక్షా కార్మికుడితో, మరికొన్ని రోజులు సాధువుతో కలసి ఓ గదిలో రోజులు వెళ్లదీశాడు. రోడ్‌సైడ్ కొట్టుల్లో టిఫన్, భోజనం చేశాడు. అలా నెల రోజుల అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత తాను ఎక్కడున్నాడనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశాడు. దీంతో అతని సోదరి కృపాలి, పెదనాన్న తదితరులు హైదరాబాద్‌కు వచ్చిన అతని కష్టాలను తెలుసుకున్నారు.
Trivedi IPS, Hitarth's father Savjibhai, Hitarth Ghanshyambhai Dholakia and his
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి, హితార్థ్ ఫ్యామిలీకి స్నేహం ఉంది. అయితే తన కొడుకు హైదరాబాద్ వచ్చిన విషయాన్ని ఘనశ్యామ్ ఆయనకు తెలియనీయలేదు. నెల రోజులపాటు అజ్ఞాతంలో గడిపాకే.. కుటుంబ సభ్యులు వచ్చి హితార్థ్‌ను కలిశారు. ఏటా పండుగల సమయంలో తన దగ్గర పనిచేసే వారికి కార్లు, ఖరీదైన ఫ్లాట్లు ఇస్తూ వార్తల్లో నిలిచే వజ్రాల వ్యాపారి ఈ సారి తన కొడుకును ఇలా బయటకు పంపి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో హితార్థ్ సోదరుడు కూడా ఇలాగే నెల రోజులపాటు వేరే ఊళ్లో గడిపాడు.
ఇంతకీ హితార్థ్ హైదరాబాద్‌కు వచ్చేటపుడు ఫ్లైట్‌ టిక్కెట్‌తో పాటు.. కేవలం రూ.500 చేరుకున్నాడు. తన అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసేందుకు నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు. తండ్రి సూచించినట్టుగా బతికి చూపించాడు. సామాన్య బతుకు ఎలా ఉంటుందో రుచి చూశాడు. తన అజ్ఞాతవాసంపై హితార్థ్ స్పందిస్తూ.. హైదరాబాద్ తనకెంతో నచ్చిందని, తాను ఓ సాధారణ యువకుడిగా కనిపించలేక పోయానని, అయితే, తనకు తారసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్థ్ వెల్లడించారు.
ఉద్యోగం కావాలని చెబితే, ఎంతో మంది సాయం చేయాలని భావించారని, ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు. ఈ నగరం చాలా అందంగా ఉందని, మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు.
తండ్రి ఆజ్ఞను శిరసా వహించి హైదరాబాద్ లో నెలరోజులు ఓ కోటీశ్వరుడు Reviewed by on . హైదరాబాద్: తండ్రి  ఆజ్ఞను శిరసా వహించి ఓ కోటీశ్వరుడి కుమారుడు హైదరాబాద్ లో నెల రోజుల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు అది కూడ ఉదర పోషణ కోసం  దిన సరి కూలీపనులు  చేశాడు హైదరాబాద్: తండ్రి  ఆజ్ఞను శిరసా వహించి ఓ కోటీశ్వరుడి కుమారుడు హైదరాబాద్ లో నెల రోజుల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు అది కూడ ఉదర పోషణ కోసం  దిన సరి కూలీపనులు  చేశాడు Rating: 0
scroll to top