Monday , 20 May 2019

Home » ఫోర్త్ పాయింట్ » డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ఓవర్ ఆక్షన్స్

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ఓవర్ ఆక్షన్స్


రాష్ర్ట రాజధాని లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసుల ఓవర్ ఆక్షన్ పై విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టేందుకు ఎంచుకున్న కూడళ్ళలో పోలీసులు వాహనాలు చెక్ చేసి డ్రైవర్ సీటులో ఉన్న వారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు లేదా స్నైపర్ టెస్టు నిర్వహిస్తారు. ఈ టెస్టులో పాజిటివ్ వస్తే వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో మంచి ఫలితాలే వచ్చాయి. తాగు బోతులు రాత్రి పూట రోడ్లపై వాహనాలు నడపడం తగ్గి రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయి. అయితే టెస్టుల సందర్భంగా పోలీసులు మీడియా సాక్షిగా చేస్తున్న ఓవర్ ఆక్షన్ పట్ల విమర్శలు వస్తున్నాయి. జూబ్లి హిల్స్ , బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినపుడు కొందరు సెలబ్రెటీలు కూడ వాహనాల డ్రైవింగ్ సీట్లలో దొరికి పోయారు. డ్రైవింగ్ సీట్ లో లేని వారికి టెస్టులు నిర్వహించే అధికారం పోలీసులకు లేదు. కాని వాహనాలలో డ్రైవర్ పక్క సీట్లలో ఉండే సెలబ్రిటీలకూ కూడ పోలీసులు టెస్టు నిర్వహించడం వారి ప్రైవసీకి భంగం కలిగించడం అవుతుంది. మీడియా ముందు వారికి టెస్టులు నిర్వహించడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పోలీసులు సని నటి జయ ప్రదకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించేందుకు ప్రయత్నించగా ఆమె అసహనం వ్యక్తం చేసారు. అసలు ఆ సమయంలో జయప్రద డ్రైవర్ సీట్లో లేరు. అలాంటప్పుడు ఎట్లా టెస్టు నిర్వహిస్తారో పోలీసులు సమాధానం చెప్పాలి. హైదరాబాద్ నగరం అంటే విశ్వనగరంగా పేరుంది. ప్రపంచంలో పలు దేశాల నుండి ఎందరో వస్తుంటారు. ఇట్లాంటి విధానాలతో పోలీసులు మితి మీరి ప్రవర్తిస్తే చెడ్డ పేరు వస్తుంది. ఈ టెస్టులు నిర్వహించే సమయంలో అక్కడ అసలు మీడియా అవసరమా అనేది కూడ పోలీసు ఉన్నతాధి కారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులే సిసి కెమెరాల నిఘాలో డ్రైవ్ నిర్వహించి ఏవైనా అవాంఛ నీయ సంఘటనలు జరిగితే అనంతరం మీడియాకు బ్రీఫ్ చేయవచ్చు. కాని అట్లా చేయడం లేదు. మీడియా కెమెరాల నిఘాలో డ్రైవ్ నిర్వహించడం వల్ల తాగి ఉన్న తాగక పోయినా పౌరుల ప్రైవెసీని మీడియా కాని పోసులు కాని కాపాడాల్సి ఉంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ఓవర్ ఆక్షన్స్ Reviewed by on . రాష్ర్ట రాజధాని లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసుల ఓవర్ ఆక్షన్ పై విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టేందుకు ఎంచుకున్న కూ రాష్ర్ట రాజధాని లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసుల ఓవర్ ఆక్షన్ పై విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో తాగి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టేందుకు ఎంచుకున్న కూ Rating: 0

Related Posts

scroll to top