Monday , 20 May 2019

Home » Slider News » టీడీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా

టీడీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా

December 1, 2018 3:19 pm by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on టీడీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా A+ / A-

Ravela Kishorమాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేరావెల కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు.

మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అనూహ్యంగా కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. సాంఘిక, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. తర్వాత రావెల పనితీరు, జిల్లా నేతలతో సమన్వయ లోపం, గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్మన్ జానీమూన్‌తో వివాదంతో పార్టీలో ఆయనపై అసంతృప్తి మొదలయ్యింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన కేబినెట్ విస్త‌ర‌ణ‌లో రావెలను మంత్రి ప‌ద‌వి కోల్పోయారు. అప్పటి నుంచి రావెల కిషోర్ బాబు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులు క్రితం వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కాని చివరికి జనసేన వైపు మొగ్గు చూపారు.

టీడీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా Reviewed by on . మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేరావెల కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. మాజీ ఐఆర్‌ఎస్‌ అధి మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేరావెల కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. మాజీ ఐఆర్‌ఎస్‌ అధి Rating: 0

Related Posts

scroll to top