Wednesday , 22 August 2018

Home » Slider News » టిడిపి నాయకుడి హోటెల్ లో అశ్లీల నృత్యాలు

టిడిపి నాయకుడి హోటెల్ లో అశ్లీల నృత్యాలు

July 19, 2018 8:43 pm by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on టిడిపి నాయకుడి హోటెల్ లో అశ్లీల నృత్యాలు A+ / A-

hotel oliva treeవిజయవాడ: అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొల్లూరు రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విజయవాడలోని 47 డివిజన్‌కు అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణకు ముజ్రా పార్టీ నిర్వహణలో ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భవానీపురంలో గల ఆలీవ్‌ ట్రీ హోటల్‌లో మహిళలతో అసభ్య నృత్యాలు (ముజ్రా పార్టీ) నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి మహిళలను నృత్యాలు తిలకిస్తున్న పురుషులను అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్‌ నిర్వహిస్తున్నాడని  సాక్షి మీడియా పేర్కొంది.

పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని వెల్లడించారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. నూతన కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు చార్జి తీసుకున్న రోజునే ముజ్రా పార్టీ బాగోతం బయటపడడం గమనార్హం.

టిడిపి నాయకుడి హోటెల్ లో అశ్లీల నృత్యాలు Reviewed by on . విజయవాడ: అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొల్లూరు రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విజయవాడలోని 47 డివిజన్‌కు అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణకు ముజ్రా విజయవాడ: అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొల్లూరు రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విజయవాడలోని 47 డివిజన్‌కు అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణకు ముజ్రా Rating: 0
scroll to top