Monday , 20 May 2019

Home » Slider News » జేబుదొంగ బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా కానిస్టేబుల్

జేబుదొంగ బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా కానిస్టేబుల్

December 31, 2018 8:07 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on జేబుదొంగ బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా కానిస్టేబుల్ A+ / A-

భర్త ఫోనులో పసిపాప ఏడుపు విని.. క్యాబ్ బుక్ చేసుకుని మరీ వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్

నైట్ షిఫ్టులో ఉన్న మహిళా కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకుంది. పాలులేక గుక్క పట్టి ఏడుస్తున్న ఓ పసిబిడ్డకు కాబ్ బుక్చేసుకుని వెళ్లి   పాలిచ్చింది. ఆ పసిపాప ఓ డేబుదొంగ బిడ్డని ఆతర్వాత తెల్సింది. 

mother and childహైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నైట్ షిఫ్ట్‌లో ఉన్న రవీందర్ అనే కానిస్టేబుల్‌కు రోడ్డుపై చంటిపాప ఏడుస్తూ కనిపించింది. పక్కనే ఉన్న ఆ తల్లి మద్యం మత్తులో పడి ఉంది. దీంతో ఆ పాప తల్లి ఏమైనా స్పందిస్తుందేమోనని కాసేపు రవీందర్ ఎదురు చూశాడు. కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. వెంటనే బేగంపేట పీఎస్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆ పిల్లాడి ఏడుపు కానిస్టేబుల్ భార్యకు వినిపించింది. ఒక సంవత్సరం బిడ్డకు తల్లైన ప్రియాంక మనసు ఆ పిల్లాడి ఏడుపు విని చలించిపోయింది. తానే అక్కడికి వస్తానని భర్తతో చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని అరగంటలో భర్త ఉన్న చోటికి వచ్చింది.

ప్రియాంక వచ్చి గుక్క పట్టి ఏడుస్తున్న ఆ బిడ్డకు పాలిచ్చింది. చంటిపాప ఏడుపు ఆపిన తర్వాత రవీందర్, ప్రియాంక ఆ పాపను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీ అంజన్ కుమార్ కానిస్టేబుల్ దంపతులను అభినందించారు. ఫ్రెండీ పోలీసింగ్ అన్న మాటను అక్షరాలా నిజం చేసిన ప్రియాంకకు బహుమతినిచ్చారు.

 

జేబుదొంగ బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా కానిస్టేబుల్ Reviewed by on . భర్త ఫోనులో పసిపాప ఏడుపు విని.. క్యాబ్ బుక్ చేసుకుని మరీ వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్ నైట్ షిఫ్టులో ఉన్న మహిళా కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకుంది. పాలులేక గుక భర్త ఫోనులో పసిపాప ఏడుపు విని.. క్యాబ్ బుక్ చేసుకుని మరీ వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్ నైట్ షిఫ్టులో ఉన్న మహిళా కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకుంది. పాలులేక గుక Rating: 0

Related Posts

scroll to top