Thursday , 19 October 2017

Home » Slider News » జయమ్మ మరణంపై న్యాయ విచారణకు ఆదేశం

జయమ్మ మరణంపై న్యాయ విచారణకు ఆదేశం

August 17, 2017 6:13 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on జయమ్మ మరణంపై న్యాయ విచారణకు ఆదేశం A+ / A-

JAYALALITA TN EX CM చెన్నై:మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై  న్యాయ విచారణకు ఆదేశిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.  పళని స్వామి,  ప‌న్నీరుసెల్వంల కలయిక సందర్భంగా  విధించిన శరతులు అమలు చేసేందుకు జ‌య మ‌ర‌ణంపై విచార‌ణకు ఆదేశించారు. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్‌ల‌ తేరుకోలేని షాక్ అని పార్టి వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు.. చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసమైన వేద నిలయంను స్మారక మందిరంగా మార్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా.. దివంగత ముఖ్యమంత్రి జయలలితపై జ్యుడీషియల్ విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని పళని తెలిపారు. ఈ కమిటీని త్వరలోనే నియమిస్తారు. దర్యాప్తుకు నిర్దిష్ట గడువును విధిస్తున్నట్లు తెలుస్తోంది. ‘అమ్మ’ జయలలిత మరణంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
జయమ్మ మరణంపై న్యాయ విచారణకు ఆదేశం Reviewed by on . చెన్నై:మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై  న్యాయ విచారణకు ఆదేశిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.  పళని స్వామి,  ప‌న్నీరుసెల్వంల కల చెన్నై:మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై  న్యాయ విచారణకు ఆదేశిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.  పళని స్వామి,  ప‌న్నీరుసెల్వంల కల Rating: 0
scroll to top