Tuesday , 12 December 2017

Home » Slider News » జగన్‌కు ఈసీ నోటీసులు……వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవు

జగన్‌కు ఈసీ నోటీసులు……వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవు

August 6, 2017 9:57 am by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on జగన్‌కు ఈసీ నోటీసులు……వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవు A+ / A-

babu and jaganనంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ చంద్రబాబుపై నోరు జారినందుకు ఎన్నికల కమీషన్ నోటీసు జారి చేసింది. 48 గంటల వ్యవధిలో వివరణ ఇవ్వక పోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.  జగన్ చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.  రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) పంపిస్తామని, ఆ తర్వాత సీఈసీ సూచనల మేరకే చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ స్పష్టం చేశారని తెలుస్తోంది. 48 గంటల్లోగా స్పందించాలని అందులో సూచించారు. వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకోనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చేయాలని జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించింది. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) పంపిస్తామని, ఆ తర్వాత సీఈసీ సూచనల మేరకే చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ స్పష్టం చేశారని తెలుస్తోంది.

జగన్‌కు ఈసీ నోటీసులు……వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవు Reviewed by on . నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ చంద్రబాబుపై నోరు జారినందుకు ఎన్నికల కమీషన్ నోటీసు జారి చేసింది. 48 గంటల వ్యవధిలో వివరణ ఇవ్వక నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ చంద్రబాబుపై నోరు జారినందుకు ఎన్నికల కమీషన్ నోటీసు జారి చేసింది. 48 గంటల వ్యవధిలో వివరణ ఇవ్వక Rating: 0

Related Posts

scroll to top