Monday , 18 June 2018

Home » Slider News » గౌతమి పుత్ర ట్రెయిలర్ విడుదల

గౌతమి పుత్ర ట్రెయిలర్ విడుదల

December 16, 2016 1:11 pm by: Category: Slider News, సినిమా Leave a comment A+ / A-

కరీంనగర్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రెయిలర్ విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ.. ‘మైక్‌ పట్టుకుంటే ఈ సినిమా గురించి చెప్పకుండా ఆగలేం. ఈ ట్రైలర్‌ చూడాలి. 100వ చిత్రాన్ని ఈ యూనిట్‌లో ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. కోటి రతనాల వీణ తెలంగాణ. ఇక్కడి కోటిలింగాల సాక్షిగా నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం’ అని అన్నారు. శాతవాహనుల ఆనవాళ్ళు కలిగిన కోటి లింగాల ను సందర్శించిన బాలయ్య పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ రోజున చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేయాలని ఎన్టీఆర్ అనుకున్నా ఆ కోరిక నెర వేర లేదు. తండ్రి కోరిక నెర వేర్చేందుకు బాలయ్య చాలా పట్టదలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాత వాహనులు క్రీస్తు పూర్వం 231 నుండి క్రీస్తు శకం 221 వరకు పాలించారు. శాతవాహనులలో 23 వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణుడు.శాతవాహనులు హిందూ మతాన్ని అదే విదంగా భౌద్ధ మతాన్ని ఆచరించారు.

గౌతమి పుత్ర ట్రెయిలర్ విడుదల Reviewed by on . కరీంనగర్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రెయిలర్ విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల కరీంనగర్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రెయిలర్ విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల Rating: 0
scroll to top