Monday , 20 May 2019

Home » Slider News » గెలుపు కోసం గుడ్ల గూబలతో తెలంగాణ నేతల క్షుద్ర పూజలు?

గెలుపు కోసం గుడ్ల గూబలతో తెలంగాణ నేతల క్షుద్ర పూజలు?

December 4, 2018 5:32 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on గెలుపు కోసం గుడ్ల గూబలతో తెలంగాణ నేతల క్షుద్ర పూజలు? A+ / A-

            కర్నాటకలో పట్టు బడ్డ వేటగాళ్ళు

Wolfతెలంగాణ ఎన్నికల్లో గుడ్ల గూబలు బలిస్తున్నారా…? నిషాచర పక్షులైన ఈ గుడ్ల గూబలతో ప్రత్యర్థుల ఓటమికి ముగ్గేసి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారా…? గెలుపు కోసం ఏ దారి వదలని అభ్యర్థులు ఇలాంటి తాంత్రిక విద్యలతో అడ్డదార్లు తొక్కు తున్నారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ఆసక్తి రేపుతోంది.

పొరుగు రాష్ర్టం అయిన కర్నాటక లో డేగ జాతికి చెందిన గుడ్ల  గూబలు మాయం అవుతున్నాయట.

సెడామ్ పట్టణానికి చెందిన వేటగాళ్లు కొందరు గుడ్లగూబలను తెలంగాణ రాష్ర్టానికి తరలించే ప్రయత్నంలో అక్కడి కలబుర్గికి చెందిన జిల్లా పోలీసులకు దొరిక పోయారు. దాంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారిని విచారించినపుడు ఆసక్తి కరమైన విషయాలు బయట పడ్డాయి. తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు రాత్రి వేళల్లో సంచరించే ఈ నిషాచరపక్షులు కావాలని ఆర్డర్ చేశాడని వేటగాళ్ళు పోలీసులకు తెలిపారు.

జమఖండి, బగల్ కోట్ జిల్లాల నుండి ఈ గుడ్ల గూబలు వేటాడి ప్రాణాలతో తెచ్చినట్లు పోలీసులకు చెప్పారు. ఒక్కో గుడ్ల గూబను రూ 3 నుండి 4 లక్షల వరకు విక్రయించే ప్రయత్నాలు చేశారని కర్నాటక అటవి శాఖ అధికారులు తెలిపారు.

గుడ్లగూబలను ఆర్డర్ చేసింది తెలంగాణకు చెందిన ఏ అభ్యర్థి అనేది వేటగాళ్ళు వెల్లడించారా లేదా అనేవిషయాలు తెలియవు. పోలీసులు కూడ అతని పేరు బయట పెట్టలేదు.

రాత్రి వేళ ఎక్కువగా సంచరించే ఆ పక్షి కళ్లు  చిమ్మటి చీకట్లో మిల మిల మెరిస్తుంటాయి. అందుకే వీటిని చూస్తే భయ పడుతుంటారు. ఇవి రాత్రి వేళలో కనిపిస్తే కీడుగా భావిస్తారు. గుడ్ల గూబ ఇంట్లో చొరబడితే ఏదో కీడు జరుగుతుందని శంకించి ఆ ఇండ్లు వదిలివేయటం జరుగుతుంది.

గుడ్లగూబలను బలి ఇచ్చి వాటి శరీర ఖండాలు ప్రత్యర్థుల ఇండ్ల ముందు వేయడం ద్వారా తమకు గెలుపు వారికి ఓటమి ప్రాప్తిస్తాయని బావిస్తారు. గుడ్లగూబల ఈకలు, తల,కళ్ళు, కాళ్ళు ఇండ్ల మందు పడేస్తే ప్రత్యర్థులు తమ కేదో కీడు జరిగినట్లు భావిస్తారట.

గుడ్ల గూబల రక్తం ఇతర శరీర భాగాలను కొన్ని రకాల  వైద్య చికిత్సల్లో  కూడ ఉపయోగిస్తారట. గుడ్ల గూబలు అరిస్తే ఏదో అరిష్టం జరుగుతుందని కూడ శంకిస్తారు. ఈ పక్షులతో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండడంతో పక్షులు క్రమంగా అంతరించి పోతున్నాయని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

గుప్త నిధుల వేటలో ఈ పక్షులను చాలాకాలంగా వినియోగిస్తున్నారట. గుడ్ల గూబతో క్షుద్ర పూజ నిర్వహించిన తర్వాత 270 డిగ్రీల కోణంలో తల తిప్పన చోట నిధి  నిక్షిప్తమై ఉంటుందని  తవ్వుతుంటారు. ఎక్కువగా ఇలాంటి క్షుద్ర పూజలు   దీపావళి, దసరా పండగల సమయంలో జురుగుతుంటాయట. ఈ పండగల సమయాల్లో వేటగాళ్ళు  పక్షులను వేటాడి పట్టి లక్షల్లో విక్రయిస్తారట.

దేశంలో మొత్తం 33 జాతులకు చెందిన గుడ్ల గూబలు ఉండగా వీటిలో చాలా జాతులు నశించి పోయాయట. ప్రస్తుతం రెండు మూడు జాతుల పక్షులు మాత్రమే  అవి కూడ తక్కువ సంఖ్యలో మిగిలాయని అటవి శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నాటక రాష్ర్టంలో చాలా కాలంగా గుడ్లగూబల అక్రమ రవాణా జరుగుతోంది. బెంగళూరు, మైసూర్, బెల్గావి తదిర ప్రాంతాల్లో వీటి అక్రమ రవాణాకు  సంభందించిన కేసులు గతంలో నమోదయ్యాయని అటవి శాఖ అధికారులు తెలిపారు. .గుహల నుండి ట్టమైన అటవి ప్రాంతాల్లో చెట్ల పై నుండి వీటిని చాకచక్యంగా వేటాడి తెస్తున్నారు.

గుడ్ల గూబలు అరిస్తే ఏదో అరిష్టం జరుగుతుందని కూడ శంకిస్తారు. ఈ పక్షులతో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండడంతో పక్షులు క్రమంగా అంతరించి పోతున్నాయని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

ఆకుల నరేందర్

 

గెలుపు కోసం గుడ్ల గూబలతో తెలంగాణ నేతల క్షుద్ర పూజలు? Reviewed by on .             కర్నాటకలో పట్టు బడ్డ వేటగాళ్ళు తెలంగాణ ఎన్నికల్లో గుడ్ల గూబలు బలిస్తున్నారా...? నిషాచర పక్షులైన ఈ గుడ్ల గూబలతో ప్రత్యర్థుల ఓటమికి ముగ్గేసి క్షుద్ర ప             కర్నాటకలో పట్టు బడ్డ వేటగాళ్ళు తెలంగాణ ఎన్నికల్లో గుడ్ల గూబలు బలిస్తున్నారా...? నిషాచర పక్షులైన ఈ గుడ్ల గూబలతో ప్రత్యర్థుల ఓటమికి ముగ్గేసి క్షుద్ర ప Rating: 0
scroll to top