Friday , 19 July 2019

Home » Slider News » క్రౌడ్ ఫండింగ్ తో పత్రికలు రావాలి…దేవులపల్లి అమర్

క్రౌడ్ ఫండింగ్ తో పత్రికలు రావాలి…దేవులపల్లి అమర్

January 11, 2017 2:32 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

ఉద్యమ సమయం లోనే మీడియా కొంత ప్రో ఆక్టివ్ గా పనిచేసింది…కాని ఇప్పుడా పరిస్థితి లేదు…… దేవులపల్లి అమర్

తేది 10 జనవరి 2017
స్థలం: హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల
అంశం: తెలంగాణ రాష్ర్టంలో మీడియా పాత్ర

పత్రికలు ఒకళ్ళిద్దరి పెట్టుబడులతో కాకుండా క్రౌడ్ ఫండింగ్ తో రావాలి

(తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత రెండున్నరేండ్ల అనంతరం వరంగల్ లో విద్యార్థులు విద్యావేత్తలు మేధావులతో ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల కాన్ఫరెన్సు హాలులో కిక్కిరిసిన సదస్సు ఇది. ప్రజా తంత్ర దినపత్రిక నిర్వహించిన ఈ సదస్సులో సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ చేసిన ప్రసంగం)
తెలంగాణ ఉద్యమ కాలంలో మీడియా కొంతలో కొంత ప్రోఆక్టివ్ గా…తెలంగాణకు అనుకూలంగా పనిచేసిందేమో కాని తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిలో పరిమితులకు లోబడి అయినా ప్రతిఘటించే ఓ కార్యక్రమం జర్నలిస్టులు చేయాల్సి ఉంది. మీడియా సంస్థలు చేయాల్సిన అవసరం ఉంది.
పత్రికలు మీడియా సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో మనకు తెల్సు….వ్యాపారంతో సంభందం లేకుండా ఇవ్వాల మీడియా నడిచే పరిస్థితి లేదు.వ్యాపార ప్రయోజనాల వెనకాల రాజకీయ ప్రయోజనాలు కూడ వస్తున్నాయి. నిఖార్సైన సమాచారాన్ని సత్యాన్వేషణ…ప్రజల గురించి నిలబడే పరిస్థితి పూర్తిగా ఆశించడం సాద్యం కాదు. స్వేచ్చ పాక్షికంగా ఉంటది.అందుకే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ లో నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇతర రాష్ర్టాలు తిరుగుతున్న క్రమంలో ఒక చర్చ జరుగుతున్నది. అన్ని రాష్ర్టాలలో కొన్ని పత్రికలు రావాలే నని. పత్రికలు క్రౌడ్ ఫండింగ్ తో రావాలే. ఎవరో ఒక్కరో ఇద్దరో ముగ్గురో పెట్టుబడి పెట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం పత్రికలను నడిపించే విధంగా కాకుండా క్రౌడ్ ఫండింగ్ తో నడిపించే విదంగా రావాలి. తెలంగాణ రాష్ర్టంలో 5 కోట్ల మంది ప్రజలుంటే అందులో మనం ఒక కోటి మందినైనా అప్రోచ్ కాగలిగితే తలా వంద రూపాయలు పెట్టించినా వంద కోట్ల రూపాయలవుతవి. అట్లాంటివన్ని చేయగలమా ప్రాక్టికల్ గా అవి సాధ్యమా కాదా అనేది చర్చ జరుగుతోంది. ఇట్లాంటి ఆలోచన కూడ ఒకటి చేయాలి…చేస్తే ఎవరి ప్రయోజనాల కొరకో కాకుండా పత్రికలు నిష్పక్ష పాతంగా నడవ డానికి వీలుంటది. ఈ రోజుల్లో మీడియా సంస్థలలో ఇతరేతర ప్రయోజనాలున్నంత కాలం సాపేక్షికత తప్ప నిష్పాక్షికతను ఆశించలేం.
ఈ రోజు దేశంలో రెండు తెలుగు రాష్ర్టాలలో ఉన్న పరిస్థితులు ఏమిటో చుస్తున్నాం. 11976 లో ఎమర్జెన్సి చూశాం. నవంబర్ 8 రాత్రి ఎవ్వరికి సమాచారం లేకుండా కనీసం మంత్రి వర్గ సహచరులకు కూడ తెలియకుండా ప్రధాని నరేంద్ర మోడి నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. మన తెలుగు రాష్ర్టాలలో ముఖ్యమంత్రుల నిర్ణయాలు కూడ ఎవరికి తెలియకుండా ఉంటున్నాయి.
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అయితే ఏం వస్తదని నేను ప్రశ్నించినందుకు గతంలో నా దిష్టి బొమ్మలు దగ్దం చేసారు. తెలంగాణ వస్తే గొప్ప ఆద్భుతం జరుగుతుందనుకుంటున్నారు మీరు……పరిస్థితులన్ని మారిపోతాయని అనుకుంటున్నారా…..జర్నలిస్టుల పరిస్థితులేమైనా మారుతాయని అనుకుంటున్నారా అని అడిగినందుకు దిష్టి బొమ్మలు దగ్దం చేశారు.
తెలంగాణలో పనిచేస్తున్న 90 శాతం 95 శాతం జర్నలిస్టులు ఆంధ్ర యాజమాన్యాల్లోనే పనిచేస్తున్నారు. ఒకటి రెండు తప్ప తెలంగాణ యాజమాన్యాల్లో పత్రికలు లెక్కెయ్యండి……మరి ఆంధ్ర యాజమాన్యాల్లో పనిచేస్తున్న వాళ్ళనందర్ని తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అనంతరం ఇక్కడి నుండి వెళ్ళ గొట్టినామా…..వెళ్ళ గొట్ట గలమా…..సాధ్యమయ్యే పనేనా అది…..ఇది వారికి తెల్సు…..కాని ఆనాడు…..తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే అంతా అయిపోయిందిక….పోలీసులంతా స్వాంత స్వభావులు అయి పోతారు…రాష్ర్టంలో తప్పుడు కేసులుండవు…రాష్ర్ట మంతా సస్య శ్యామలమై పోతది…రైతుల ఆత్మహత్యలు ఉండవు….ఇట్లాంటి భ్రమలింకా కొందరికి ఉండడం సరైంది కాదు.

అందరం తెలంగాణ రాష్ర్టం కావాలని పోరాటం చేసినం.నిధులు, నీళ్ళు నియామకాలలో మనకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాష్ర్టం తెచ్చుకున్నం. తెచ్చుకున్న రాష్ర్టంలో కూడ వీటిని సాదించుకునేందుకు జరగాల్సిన పోరాటానికి అందరు వ్యక్తులు అన్ని ప్రజా సంఘాలతో పాటు అన్ని వ్యవస్థలతో పాటు ప్రజాతంత్ర దిన పత్రిక కూడ వెంట ఉండి పోరాటం చేస్తుంది. ప్రజాతంత్ర వెంట మీరందరూ ఉండాలని అడుగుతున్నం.
ఎమర్జెన్సికాలంలో ప్రజాతంత్ర యాంటి ఎస్టాబ్లిష్ మెంట్ గా నడిచింది. పత్రికను ఆ రోజుల్లో బాన్ చేసారు. ఆ పత్రికను తీసుకుని 1998 నుండి తెలంగాణలో ఓ స్వంత పత్రిక ఉండాలని వార పత్రికను ప్రారంభించాం. ఓరకంగా పత్రిక నాకోసం ఆవిర్భవించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభలో నేను అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నపుడు భువనగరిలో 1996 లో జరిగిన తొలి తెలంగాణ సభ వార్త ఫ్రంట్ పేజిలో ఇచ్చాను సంపాదకులు నాతో విబేదించారు. తెలంగాణ లేదు ఏం లేదు అనవసరమైన కవ్వింపులకు పోవద్దు అంటూ చెప్పారు. పరిస్థితులు మారాయని ఇక తెలంగాణ వార్తలు రాయకుండా ఉండలేమని చెప్పినా వినిపించుకోలేదు. కారణాలు ఏమైతే నేమి ఆరు నెలల తర్వాత ఆంధ్ర ప్రభలో ఉద్యోగం మానుకోవాల్సి వచ్చింది.
1998 లో ప్రజా తంత్ర వార్త పత్రికను నా సంపాదకత్వంలో నా సోదరుడు అజయ్ ప్రారంభించారు. ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్రికను ప్రారంభించారు. ఆరోజుల్లో జన్మభూమి కార్యక్రమం బాగా పాపులర్ అయిన ప్రోగ్రాం…పత్రికలో జన్మభూమి గురించి ఉంటుందని అందరూ అనుకున్నారు.
కాని జరిగిందేంటంటే అంతకు ముందు వరంగల్ లో జరిగిన తెలంగాణ సభకు సంభందించి తేల్చుకుని రమ్మంది తెలంగాణ అనే హెడ్డింగ్ తో గద్దర్ ముఖ చిత్రంతో ప్రచురించాం. అది చూసి చంద్రబాబు నాయుడు ఇబ్బందికి గురయి ఆ తర్వాత సర్దుకున్నాడు. అప్పటి నుంచి 2004 సంవత్సరం వరకు నేను ప్రజా తంత్రకు సంపాదకులుగా ఉండి 2004లో ప్రభుత్వ ఉద్యోగం కారణంగా(ప్రెస్ అకాడమి చైర్మన్ గా నియామకం) నేను ప్రజాతంత్రకు సంపాదక భాద్యతలు వదులు కోవాల్సి వచ్చింది.
ఈ రోజు ప్రజా తంత్ర మీ ముందుకు వచ్చింది. ఇక ముందు జరగబోయే ఏ ఉద్యమంలోనైనా ప్రజాతంత్ర ముందుంటుంది. మీరంతా ప్రజా తంత్ర వెంట ఉండాలని ఆశిస్తున్నాం.

క్రౌడ్ ఫండింగ్ తో పత్రికలు రావాలి…దేవులపల్లి అమర్ Reviewed by on . ఉద్యమ సమయం లోనే మీడియా కొంత ప్రో ఆక్టివ్ గా పనిచేసింది...కాని ఇప్పుడా పరిస్థితి లేదు...... దేవులపల్లి అమర్ తేది 10 జనవరి 2017 స్థలం: హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ ఉద్యమ సమయం లోనే మీడియా కొంత ప్రో ఆక్టివ్ గా పనిచేసింది...కాని ఇప్పుడా పరిస్థితి లేదు...... దేవులపల్లి అమర్ తేది 10 జనవరి 2017 స్థలం: హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ Rating: 0

Related Posts

scroll to top