Friday , 21 September 2018

Home » Slider News » కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు: కేటీఆర్

కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు: కేటీఆర్

September 11, 2017 8:22 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు: కేటీఆర్ A+ / A-

minister KTRహైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ, బతుకమ్మ చీరల పంపిణీ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కేటీఆర్ ఈ నెల 16 నాటికి అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరలు చేరాలని అధికారులను ఆదేశించారు. చీరల పంపిణీ వల్ల నేతన్నలకు ఉపాధితోపాటు ఆడబిడ్డలకు పండుగ కానుక అందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పునరుద్ఘాటించారు. ఈ ఏడాది ఆర్డర్లతో 3 నెలలపాటు నెలకు కనీసం రూ.15వేల ఆదాయం చేకూరిందన్నారు.

వచ్చే ఏడాది నుంచి నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లతో 8 నెలలపాటు ఉపాధి కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. చేనేత వస్ర్తాలకు డిమాండ్ ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో వెంటనే టెస్కో షోరూం ఏర్పాటు చేయాలని అధికారులను నిర్దేశించారు. కేంద్రమంత్రులను కలిసినపుడు చేనేత వస్ర్తాలు, గోల్కొండ కళాకృతులను బహుమతిగా ఇవ్వాలని కేటీఆర్ సూచించారు.

కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు: కేటీఆర్ Reviewed by on . హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత, వస్త్ హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలు అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత, వస్త్ Rating: 0
scroll to top