Friday , 21 September 2018

Home » Slider News » కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు

కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు

August 19, 2017 7:40 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు A+ / A-

KCR AGRICULTURIST AWARDహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి 2017 ఏడాదికి గాను కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో సీఎంకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి 2008 నుంచి భారత ఆహార, వ్యవసాయ మండలి ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. రైతుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ అవార్డు ప్రకటించడం పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు, వివిధ వర్గాల అభ్యున్నతి ద్వారా గ్రామసీమలను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. రూ. 17000 కోట్ల రుణాలు మాఫీ చేసిన కేసీఆర్.. రైతన్నలకు ఆసరాగా నిలిచేందుకు వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వబోతున్నారు. యాదవుల అభ్యున్నతి కోసం గొర్రెల పంపిణీ పథకం చేపట్టారు.

కరెంట్ సమస్యలను కూడా పూర్తిగా అధిగమించి 24 గంటలూ కరెంట్ సరఫరా అయ్యేవిధంగా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. గడువు కంటే ముందే కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణికి నీరు ఇచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు Reviewed by on . హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి 2017 ఏడాదికి గాను కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డును ప్రకటించింది. స హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి 2017 ఏడాదికి గాను కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డును ప్రకటించింది. స Rating: 0
scroll to top