Tuesday , 25 June 2019

Home » Slider News » కూలీలకు బేడీలు…కరీంనగర్ లో ఘోరం

కూలీలకు బేడీలు…కరీంనగర్ లో ఘోరం

August 19, 2017 11:29 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on కూలీలకు బేడీలు…కరీంనగర్ లో ఘోరం A+ / A-

handcups to Agriculture labourకరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు సుప్రీం కోర్టు మార్గ దర్శకాలు తుంగలో తొక్కారని విమర్శలు వెల్లు వెత్తాయి. ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను తీసుకెళ్లినట్టు కూలీలను పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తరలించారు. ఖమ్మంలో మిర్చి పంటకు మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలకు బేడీలు వేసిన పోలీసులు ఇప్పుడు గూడు కోసం పోరాటం చేసిన కరీంనగర్‌ కూలీలకు సంకెళ్లు బిగించారు.

సిపిఎం అనుభంద నవ తెలంగాణ దిన పత్రిక ఈ వార్తను ప్రముఖంగ ప్రచురించింది.

నవ తెలంగాణ వార్త…..

కేసుల్లో కోర్టుకు నిందితుల తరలింపు

– కరీంనగర్‌లో ఘటన.. సుప్రీం ఆదేశాలు బేేఖాతరు
– మొన్న ఖమ్మంలో రైతులు.. నేడు కరీంనగర్‌లో కూలీలు.. వాళ్లంతా ‘రెక్కాడితేగానీ డొక్కాడని’జీవులే. కానీ ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను తీసుకెళ్లినట్టు బేడీలతో కోర్టుకు తరలించారు. ఖమ్మంలో మిర్చి పంటకు మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలకు బేడీలు వేస్తే… ఇప్పుడు గూడు కోసం పోరాటం చేసిన కరీంనగర్‌ కూలీలకు సంకెళ్లు బిగించారు. ఈ రెండు ఘటనల్లోనూ సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. ఏడుగురు కూలీలకు బేడీలు వేసి తరలించారు. అందులో ఐదుగురు దళితులు. ఈ ఘటన కరీంనగర్‌ జైలు వద్దశుక్రవారం ‘నవతెలంగాణ’ కంటబడిందని పత్రిక పేర్కొంది.
2007లో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్‌లో ఇండ్ల స్థలాల కోసం కూలీలు భూపోరాటం చేశారు. స్థలాలు కేటాయించాల్సిన అప్పటి ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేయించింది. అప్పుడు 33 మందిపై కేసులు నమోదయ్యాయి. అందులో కొందరు చనిపోయారు. మరికొందరు కరీంనగర్‌లో పనిలేక ఇతర ప్రాంతాలకు వలసెళ్లారు. దీంతో భూ పోరాట కేసులో కోర్టుకు హాజరుకాలేదు. ఇక నుంచి కోర్టుకు హాజరవుతామని 11 మంది ఈ నెల 17న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్‌ సివిల్‌ రైట్స్‌ కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జిల్లా జైలుకు రిమాండ్‌కు పంపారు. కోర్టులో పేషి ఉండటంతో గందె కొమురయ్య, పండు రమేశ్‌, దొంతి శంకర్‌, మారుపాక దేవరాజ్‌, బొమ్మదేని ఆగయ్య అనే దళితులకు సంఘవిద్రోహ శక్తులకు వేసినట్టు బేడీలు వేసి తరలించారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ 11 మందిలో నలుగురు మహిళలు ఉన్నారు. కూలీలకు బేడీలు వేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూలీలకు బేడీలు…కరీంనగర్ లో ఘోరం Reviewed by on . కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు సుప్రీం కోర్టు మార్గ దర్శకాలు తుంగలో తొక్కారని విమర్శలు వెల్లు వెత్తాయి. ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను తీసుకెళ్లినట్టు కూల కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు సుప్రీం కోర్టు మార్గ దర్శకాలు తుంగలో తొక్కారని విమర్శలు వెల్లు వెత్తాయి. ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను తీసుకెళ్లినట్టు కూల Rating: 0
scroll to top