Friday , 19 July 2019

Home » Slider News » కింగ్ ఎవరో?  కింగ్ మేకర్ ఎవరో?  తేల్చనున్న తెలంగాణ ప్రజలు..

కింగ్ ఎవరో?  కింగ్ మేకర్ ఎవరో?  తేల్చనున్న తెలంగాణ ప్రజలు..

December 5, 2018 8:52 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on కింగ్ ఎవరో?  కింగ్ మేకర్ ఎవరో?  తేల్చనున్న తెలంగాణ ప్రజలు.. A+ / A-

                       ఉప్పు వర్సెస్ నిప్పు రాజకీయాలు

KCR and Babuరాష్ర్టంలో జరుగుతున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా అమితాసక్తి కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టంతో సహా మరో నాలుగు రాష్ర్టాలలో ఎన్నికలు జరుగుతున్నా మిగతా రాష్ర్టాలకంటే తెలంగాణ రాష్ర్ట ఎన్నికల పరిస్థితులపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. జాతీయ మీడియా కూడ గతంలో ఎన్నడూ లేని విదంగా తెలంగాణ రాష్ర్ట ఎన్నికలకు సంభందించిన  విశేషాలకు విశ్లేషణలకు  అధిక ప్రాధాన్యత కల్పించింది.

అందుకు కారణాలు కూడ చాలా ఉన్నాయి.  రాజకీయంగా ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు తెలంగాణ ముఖ్య మంత్రి ఓ వైపు  నిలవగా మరో వైపు అతని జిత్తుల మారి చిక్కుల్లో వోటుకు నోటు కేసు లో ఇరుక్క పోయిన ఎపి సిఎం చంద్ర బాబు నాయుడు మరో వైపు నిలిచారు. కెసిఆర్  గెలిస్తే మరో సారి “కింగ్” అవుతారు. మహాకూటమి గెలుపు ద్వారా  బాబు “కింగ్ మేకర్” అవుతారు.

ఎన్నికల్లో బహుముఖ పోటీ జరుగుతున్నప్పటికి ప్రధాన పోటి మాత్రం తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీకి అట్లాగే కాంగ్రేస్, తెలుగుదేశం, టిజెఎస్, సిపిఐ పార్టీలతో ఏర్పడిన  మహాకూటమి మధ్యే కనిపిస్తోంది.  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టి అన్ని స్థానాలకు పోటి చేస్తున్నా ఈ పార్టి  గట్టి పోటి ఇవ్వలేక పోతున్నది.  సామాజిక వర్గాల కోసమంటూ  సిపిఎం అనుభంద బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టి కూడ పోటీలో నిలిచినా  అంతగా  ప్రభావితం కనిపించటం లేదు.

బిజెపి ఎన్నికల ప్రచారంలో ఏ లోటూ రాకుండా హేమా హేమీలను ప్రచారంలో దింపింది. పార్టి అధ్యక్షులు అమిత్ షాతో సహా  స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది పలువురు కేంద్ర మంత్రులు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాద్ యోగి ప్రచారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోది  నిజామాబాద్, మహబూబ్ నగర్ సభల్లో పాల్గొని కెసిఆర్ ను ప్రధాన టార్గెట్ చేసారు.

మరో వైపు మహా కూటమి తరపున యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధి కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రాహుల్ గాంధి, ఇతర నాయకులకు తోడు తెలుగు దేశం పార్టి అధ్యక్షులు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రచార పర్వంలో నిలవడంతో ఎన్నికల ప్రచారం పతాక స్తాయికి చేరింది.

రాజకీయంగా ఉప్ప నిప్పు వంటి ఇద్దరు చంద్రులు ఒకరి ఒకరు పై చేయి సాధించేందుకు ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నారు.

అన్ని పార్టీలది ఒక ఎత్తు అయితే ఏ పార్టీతో పొత్తులేకుండా  ఒంటరిగా పోటీలో నిలిచిన తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీది ఒక ఎత్తు. ఆ పార్టీ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈ ఎన్నికలు శల్య పరీక్షగా నిలిచాయి. పోటీ సాధారణంగా లేదు. కెసిఆర్ పై ముప్పేట దాడి జరుగుతోంది. పార్టీలు , నాయకులు చుట్టుముట్టి కెసిఆర్ ను ముప్పు తిప్పలు పెట్టి దిగ్భంధనం చేయాలనే  యత్నం ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది. ప్రచార పర్వంలో కెసిఆర్ తనయుడు కెటిఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత స్టార్ కాంపేయినర్స్ గా మారారు. కెసిఆర్ సూపర్ స్టార్ కాంపెయినర్ గా హెలికాప్టర్ ద్వారా రోజుకు అరడజను ఎన్నికల సభల్లో అలుపు, సొలుపు  మరిచి ప్రచారం సాగిస్తున్నారు. కెసిఆర్ శైలిలో చాలా మార్పు వచ్చింది. “ఎన్నికల్లో ఎటమెటం”  ఉందనే వాస్తవం ఆయన కొంత గ్రహించి ఉండవచ్చు. మునుపడి ఉరుములు, గర్జనలులేవు.  తిట్లు వెటకారపు  మాటలు తగ్గించి నేరుగా ఓటర్లను ఆభ్యర్థిస్తున్నారు. రెండు చేతులు జోడించి ఓట్ల కోసం ప్రాధేయ పడుతున్నారు. తెలంగాణ ప్రజల నాడి బాగా తెల్సిన నాయకుడిగా వారిని మెప్పించే రీతిలో వివరిస్తూ  కొట్లాడి సాదించిన తెలంగాణ లో డిల్లీ పెత్తనం, ఆంధ్ర పెత్తనం కావాలా  ఆలోచన చేయండి అంటూ సెంటి మెంట్ రగిలించే ప్రసంగాలు చేస్తున్నారు.

ఎన్నికలకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఎందుకు కలిగిందంటే అందుకు మరో కారణం కూడ ఉంది. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి.  కెసిఆర్ ముహూర్తం నిర్ణయించి ఎనిమిది నెలలకు ముందే అసెంబ్లి రద్దు చేసారు. ఇంకా ముందు  ఎన్నికలు జరగాలని ఆశించిన ఆయన వ్యూహం కొంత బెడిసింది. ఎన్నికల కమీషన్ కాస్త ఆలస్యం చేసి మిగతా రాష్ర్టాలతో కలిపి ఎన్నికల షెడ్యూల్డ్ ఇవ్వడంతో కెసిఆర్ వ్యూహం దెబ్బతింది. 2019 లో సాధారణ ఎన్నికలు జరుగ బోతున్నాయి, తెలంగాణ రాష్ర్ట ఎన్నికల ఫలితాలు ముందు జరగ బోయే సాధారాణ ఎన్నికలపై తీవ్ర ప్రబావం చూపనున్నాయి.

ఈ ఎన్నికల్లో పలువురు వ్యక్తులు, పార్టీల జాతకం భవితవ్యం స్పష్టంగా తేల నుంది. కెసిఆర్ అధికారం నిలుపు కోవడం చాలా అవసరం. తన మనసులో ఉన్న భయం…..అంతరంగం…. బయట పడకుండా ఓటమి ఎదురయ్యే పరిస్థితి రానీయ వద్దు సుమా…… అంటూ…..ప్రజలను హెచ్చరిస్తున్నారు. అధికారం చేజారితే…..  అను కోని ఓటమి ఎదురైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కెసిఆర్ కు ఊహకందని విషయం ఏం కాదు.

ఇక చంద్రబాబు నాయుడు  ఈ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి “కింగ్ మేకర్” కావాలను కుంటున్నాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి చంద్రబాబు “చక్ర భ్రమణం”  ఉండ బోతోంది. ప్రదాన మంత్రి నరేంద్ర మోది ని ఎదిరించి నిలిచిన చంద్రబాబు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూటమి కట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.  తెలంగాణ లో  మహాకూటమి విజయవంతం అయితే ఇక చంద్రబాబు నాయుడుకు జాతీయ రాకీయాలలో ఎదురు ఉండబోదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడ ఆయన అధికారం నిలుపు కునేందుకు ఈ విజయం దోహద పడుతుంది. లేదంటే మహా కూటమి ఓటమి అన్ని విదాలా చంద్ర బాబు నాయుడు భవిష్యత్ రాజకీయాలను అంధ కారం చేస్తుంది.

కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రాహుల్ గాంధి   విషయానికి వస్తే అటు మోదీని ఇటు కెసిఆర్ ను ఇద్దరిని  ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టి నట్లు కొట్టి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే తాపత్రయంలోఉన్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడుతో కల్సి  ఎన్నికల సభల్లో పాల్గొనడమే కాక కీలక మైన హైదరాబాద్ నగరంలో పలు చోట్ల రోడ్ షోలు నిర్వహించారు.

రాష్ర్టంలో కాంగ్రేస్ పార్టి రథ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తన శక్తి యుక్తులు ధార పోసి మహాకూటమి గెలుపు కోసం భాద్యతలు మీదేసుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అత్యదిక స్థానాలలో అభ్యర్థులను గెలిపించి టీం లీడర్ నిలవాలని విరామం ఎరుగక పనిచేస్తున్నారు.

కూన మహేందర్                                                                                    

సీనిరయర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దిన పత్రిక 05-12-2018

కింగ్ ఎవరో?  కింగ్ మేకర్ ఎవరో?  తేల్చనున్న తెలంగాణ ప్రజలు.. Reviewed by on .                        ఉప్పు వర్సెస్ నిప్పు రాజకీయాలు రాష్ర్టంలో జరుగుతున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా అమితాసక్తి కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టంతో సహా మరో నాలుగ                        ఉప్పు వర్సెస్ నిప్పు రాజకీయాలు రాష్ర్టంలో జరుగుతున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా అమితాసక్తి కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టంతో సహా మరో నాలుగ Rating: 0
scroll to top